Breaking News

ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్‌ కామెడీ థ్రిల్లర్‌

Published on Wed, 11/26/2025 - 12:58

అనుపమ పరమేశ్వరన్‌ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్‌ ‘ది పెట్‌ డిటెక్టివ్‌’. షరాఫుద్దీన్,  వినాయ‌క‌న్‌, శ్యామ్ మోహ‌న్, జ్యోమ‌న్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్‌ విజయన్‌ దర్శకత్వం వహిచారు. అక్టోబర్‌ 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్‌ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్‌) ఓ డిటెక్టివ్‌. అత‌నికి చెప్పుకోద‌గ్గ‌క కేసులుండ‌వు. అయితే త‌నను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌నిపించ‌కుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయ‌టానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్ర‌మంలో ఏర్ప‌డ్డ గంద‌ర గోళ ప‌రిస్థితుల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్మ‌గ్ల‌ర్స్‌, కిడ్నాప‌ర్స్‌, క‌నిపించ‌కుండా పోయిన ఓ చిన్నారి, మెక్సిక‌న్ మాఫియా డాన్, అరుదైన చేప‌, క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్ట‌ర్ అంద‌రూ ఈ క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తారు.  

క‌థ‌లోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మ‌లుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్‌.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌, కామెడీ మూవీ ల‌వ‌ర్స్ స‌హా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)