Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ, స్ట్రీమింగ్‌ అక్కడే!

Published on Fri, 10/27/2023 - 08:03

తొలి చిత్రం కొత్త బంగారు లోకంతోనే సూపర్‌ హిట్‌ అందుకున్నాడు శ్రీకాంత్‌ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప(అసురన్‌ రీమేక్‌) వంటి సినిమాలు తీసిన ఈయన ఈ మధ్యే పెదకాపు సినిమా తీశాడు. ఇందులో విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధా హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ కొత్తవాళ్లే కావడం విశేషం. డైరెక్టర్‌ కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో నటించాడు. అనసూయ, రావు రమేశ్‌, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రం సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. గురువారం (అక్టోబర్‌ 26) అర్ధరాత్రి నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

సినిమా కథ విషయానికి వస్తే..
1962లో గోదావరి జిల్లా అల్లర్లు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపించడంతో ఓ అనామకురాలు లంక గ్రామంలోని మాస్టర్‌(తనికెళ్ల భరణి)కు అమ్మేస్తుంది. కట్‌ చేస్తే.. 1982లో లంక గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేశ్‌), బయ్యన్న(నరేన్‌) పోటీపడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు(విరాట్‌ కర్ణ)(పది మందికి సాయం చేస్తూ, ఆపదొస్తే అండగా ఉండేవాణ్ని అప్పట్లో పెదకాపుగా పిలిచేవారు) తన అన్నయ్యతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటాడు.

ఓసారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. తర్వాత కనిపించకుండా పోతాడు. పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సత్యరంగయ్యను పెదకాపు ఎదిరించాడా? లేదా? పొలం దగ్గర బిడ్డను వదిలేసింది ఎవరు? ఈ కథలో కన్నబాబు(శ్రీకాంత్‌ అడ్డాల), అక్కమ్మ(అనసూయ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే పెదకాపు సినిమాను ఓటీటీలో చూడాల్సిందే!

చదవండి: నదీతీరంలో తడిచిన అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)