Breaking News

రెండోసారి ఆడపిల్ల.. సంతోషంలో నటి.. ఘనంగా ఫంక్షన్‌

Published on Sat, 02/10/2024 - 16:09

పర్ల్‌ మానే.. మొదట్లో పాటల ప్రోగ్రామ్‌కు, తర్వాత వంట ప్రోగ్రామ్‌, డ్యాన్స్‌ షో.. ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. యాంకర్‌గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులూ అందుకుంది. సహాయ నటిగా క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో వైదేహి అనే పాత్రలో యాక్ట్‌ చేసింది.

బిగ్‌బాస్‌ షోలో లవ్‌
ఇకపోతే ఈమె బిగ్‌బాస్‌ షోలో బుల్లితెర నటుడు శ్రీనిష్‌ అరవింద్‌తో లవ్‌లో పడింది. షో అయిపోగానే పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో పెళ్లి పీటలెక్కగా 2021లో నీల అనే కూతురు జన్మించింది. ఈ ఏడాది జనవరి 13న మరోసారి కూతురు పుట్టింది. తాజాగా ఈ పాపకు నామకరణం చేశారు. రెండో కూతురికి 'నితారా శ్రీనిష్‌' అన్న పేరు ఖరారు చేసినట్లు సోషల్‌ మీడియాలో తెలిపారు.

పాప పుట్టి 28 రోజులు..
'నితారా శ్రీనిష్‌ జన్మించి 28 రోజులవుతోంది. ఇది తన బారసాల. మా మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. మీ ఆశీర్వాదాలు కావాలి..' అంటూ ఫ్యామిలీ ఫోటోలను పర్ల్‌ మానే, శ్రీనిష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 'దేవర'లో ఎన్జీఆర్‌కు జోడీగా శ్రుతి మరాఠే.. ఇన్‌స్టాలో వెరీ పాపులర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)