Breaking News

ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Mon, 07/29/2024 - 19:09

ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవల క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ రక్షణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించింది. ఈ ఏడాది జూన్‌ 7న థియేటర్లలో రక్షణ్‌ మూవీ రిలీజైంది. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్వీట్ చేసింది. లేడీ సింగ్‌ గర్జించేందుకు వస్తోంది అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా..  ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఏసీపీ పాత్రలో అలరించారు. 

కథేంటంటే.. 
కిరణ్‌(పాయల్‌ రాజ్‌పుత్‌) ఓ పవర్‌ఫుల్‌ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్‌ చేసిన కిరణ్‌.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్‌ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్‌(మానస్‌)ని కిరణ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్‌ పగపెంచుకుంటాడు. ఓ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి అందులో కిరణ్‌ ఫోటోలను పోస్ట్‌ చేసి..ఆమె మొబైల్‌ నంబర్‌ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి.

ఇది అరుణ్‌ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్‌.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్‌ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్‌ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో కిరణ్‌ సస్పెండ్‌కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్‌ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్‌ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్‌ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్‌ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్‌ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది?  ఈ కథలో రోష‌న్‌ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి