Breaking News

నా భర్త మరో అమ్మాయితో హోటల్‌కి వెళ్లాడు: హీరో పవన్‌ సింగ్‌ సతీమణి

Published on Tue, 10/07/2025 - 09:30

భోజ్‌పురి సూపర్‌స్టార్‌, నటుడు, రాజకీయ నేత పవన్‌ సింగ్‌పై  ఆయన రెండో సతీమణి జ్యోతి సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్‌గా స్టేజీపై హీరోయిన్‌ అంజలి రాఘవ్‌ను అసభ్యకరంగా తాకి వార్తల్లో నిలిచాడు. దీంతో ఆమె ఏకంగా భోజ్‌పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో తనకు తప్పుడు ఉద్దేశం లేదని క్షమాపణలు చెప్పాడు.  అయితే, తాజాగా ఆయనపై జ్యోతి సింగ్‌ సంచలన ఆరోపణలు చేసింది.

పవన్‌ సింగ్‌, జ్యోతి సింగ్‌ ఇద్దరూ పలు విభేదాలతో దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జ్యోతి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  ఒక వీడియో పోస్ట్‌ చేసింది. తాను తన  భర్త పవన్ సింగ్ ఇంటికి వెళ్తే తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని పోలీసులపై  భగ్గుమంది. ఇప్పుడు పోలీసులు తనను తీసుకెళ్లడానికి వచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంది.  ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె మాట్లాడుతూ.. “ భార్యను బయటకు గెంటేయాలని  పోలీసులను పిలిపించుకున్న  ఈ పవన్ సింగ్ సమాజానికి సేవ చేస్తాడా..? ఎన్నికలు జరిగినప్పుడు నాకు ఫోన్ చేసి నా పేరు ఉపయోగించాడు. అవి అయిపోయిన తర్వాత  అతను మరొక అమ్మాయితో హోటల్‌కు వెళ్తాడు. కానీ, నన్ను మాత్రం భర్త ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతని తప్పులను ఎవరూ అడగరు. ఆయన మాత్రం  మా ముందే ఒక అమ్మాయిని తీసుకుని హోటల్‌కు వెళ్తాడు. దీనిని ఎవరూ అడగరు. భార్యగా, నా భర్త వేరే అమ్మాయితో ఉండటం చూసి నేను భరించలేకపోయాను, అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అని ఆమె చెప్పింది.

పవన్‌ సింగ్‌ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్‌ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్‌.. జ్యోతి సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీరి మధ్య కూడా గొడవలు రావడంతో దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ సింగ్‌ బీజేపీ నుంచి పోటీ చేయనున్నాడని సమాచారం.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)