Breaking News

'ఓజీ'.. జస్ట్‌ మిస్‌ అయింది

Published on Mon, 09/22/2025 - 10:07

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్  కల్యాణ్‌ సందడి చేశారు. అయితే, ఈవెంట్‌ కాస్త  వర్షార్పణం అయింది. 'వర్షం లేదు..బొక్కా లేదు' అని తమన్ బహిరంగంగానే కామెంట్‌ చేసినప్పటికీ  వాన మాత్రం ఊరుకోలేదు. వేదికపై ఉన్న లైట్ బాయ్ నుంచి పవన్ కల్యాణ్ వరకు అందర్నీ తడిపేసింది. దీంతో ఓజీ ఈవెంట్‌ కాస్త వర్షార్పణం కావడం ఆపై ట్రైలర్‌ కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ  చెందారు. అయితే, వేదికపై పవన్‌ కల్యాణ్‌ చేసిన కత్తిసాము వల్ల తన సెక్యూరిటీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఓజీ స్టేజీపై పవన్‌ కల్యాణ్‌ ఇలా వ్యాఖ్యలు చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా..? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు' అంటూ కత్తి పట్టుకుని స్టేజీపై పవన్‌ కల్యాణ్‌  తిప్పుతుండగా తన సెక్యూరిటీ కంటి దగ్గరి నుంచి వెళ్లింది. అయితే, అతను అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. లేదంటే తన కంటికి తీవ్రమైన ప్రమాదమే జరిగేది. అది ఒరిజనల్‌ కత్తి కాదని కొందరు.. లేదూ ఒరిజినల్‌ కత్తే అంటూ మరికొందరూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే, అది అతని కన్ను వద్ద తగిలింటే మాత్రం ఏ కత్తి అయినా సరే తీవ్రమైన నష్టం జరిగేదని చెప్పొచ్చు.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)