Breaking News

పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!

Published on Tue, 05/06/2025 - 21:13

పవన్ కల్యాణ్.. 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఎట్టకేలకు ముగించారు. అప్పుడెప్పుడో 2020 జనవరిలో మొదలైతే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తాజాగా మంగళవారంతో తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. దీంతో ఇప్పుడు రిలీజ్ డేట్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ విడుదల ఎప్పుడు ఉండొచ్చు?

(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)

క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' షూటింగ్ 2020 జనవరిలో మొదలైంది. తర్వాత కొన్నిరోజులకే లాక్ డౌన్ రావడం, తర్వాత  ఎన్నికలు, పవన్ ఎమ్మెల్యేగా గెలవడం.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అలా అలా వాయిదా పడుతూ వచ్చింది. ఎ‍ట్టకేలకు ఇన్నాళ్లకు మమా అనిపించారు.

లెక్క ప్రకారం ఈ మే 9న థియేటర్లలోకి సినిమా వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు రావట్లేదని క్లారిటీ వచ్చేసింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దగ్గర మే 30 తేదీ వినిపించింది. కానీ ఈ తేదీకి కూడా రావడం కష్టమేనేమో అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓటీటీ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ సంస్థ.. మే 30 తేదీపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జూన్ రెండో వారం అని అంటోంది.

(ఇదీ చదవండి: ‍మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)

ప్రస్తుతానికైతే విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయి. ఏదనేది ఓటీటీ సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు.. ఇలా ఓటీటీ సంస్థ చెప్పినదానిబట్టి రిలీజ్ చేస్తుండటమే దీనికి కారణం అని చెప్పొచ్చు.

మరోవైపు పవన్ సినిమా వచ్చే దానిబట్టి విజయ్ 'కింగ్డమ్' రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయాలని ఫిక్సయ్యారు. కానీ పవన్ వస్తే మాత్రం తప్పుకోవడం గ్యారంటీ. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: మంచం పట్టిన 'బలగం' నటుడు.. ప్రస్తుతం దీనస్థితిలో)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)