Breaking News

పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'.. ఆ బిగ్‌ మూవీతో పోటీ పడనుందా?

Published on Wed, 06/18/2025 - 16:42

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈనెలలో విడుదల కావాల్సినా ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెలలోనే థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడడం.. పెద్దగా బజ్‌ లేకపోవడంతో హరిహర వీరమల్లుకు డిస్ట్రిబ్యూటర్స్‌ ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.

తాజాగా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త రిలీజ్‌ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మూవీ విడుదల తేదీని గురువారం ప్రకటిస్తామని పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో కాస్తా ఆశలు చిగురించాయి. అయితే ఈ నెల చివరి వారంలో బాక్సాఫీస్ వద్దకు రానుందా..వచ్చే నెలలో రిలీజ్‌ కానుందా? అనేది రేపు క్లారిటీ రానుంది. 

అయితే మరో వైపు జూలై 25న థియేటర్లలో రానుందని సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ మూవీ కింగ్‌డమ్‌ విడుదల కానుంది. ఆ డేట్‌ కనుక ఖరారైతే బాక్సాఫీస్ వద్ద కింగ్‌డమ్‌తో హరిహర వీరమల్లు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)