Breaking News

హరిహర వీరమల్లు వాయిదా.. అదే ప్రధాన కారణమా?

Published on Thu, 06/05/2025 - 11:43

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానుల బ్యాడ్ న్యూస్. పవన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఆర్థికపరమైన సమస్యల వల్లేనని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అందువల్లే హరిహర వీరమల్లు వాయిదా తప్పేలా కనిపించడం లేదు.

అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ ఎలాంటి బజ్ లేకపోవడంతో భారీ నష్టాలు వచ్చే అవకాశముందని  పంపిణీదారులు కూడా వెనకాడుతున్నట్లు సమాచారం. ప్రధాన ఆర్థిక పరమైన సమస్యలతోనే ఈ సినిమాను వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆలస్యం కావడానికి మరో ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న వీఎఫ్‌ఎక్స్‌తో పాటు స్టూడియోలకు చెల్లింపులు చేసే గడువు కూడా ముగిసిపోయినట్లు తెలుస్తోంది. దీనివల్ల పోస్ట్-ప్రొడక్షన్‌లో మరింత జాప్యం జరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఒక వారం వాయిదా మాత్రమే ఉండొచ్చని కొందరు భావిస్తున్నప్పటికీ.. దాదాపు నెల రోజులు ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్‌.. జూన్ 12 వరకే డీల్‌కు అనుమతించినట్లు సమాచారం. ఆ తేదీ గడువు దాటితే ఒప్పందం డీల్ విలువలో రూ. 20 కోట్ల తగ్గింపు కోరినట్లు సమాచారం. ఇప్పటికే వాయిదాపై పలు ఊహగానాలు వస్తున్నప్పటికీ.. ఆలస్యం గురించి నిర్మాతల నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం కుదరపోతే జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తారని సమాచారం. 
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)