మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
అన్నగా పుట్టినప్పటికీ తండ్రిలా సాకారు.. పవన్ ఎమోషనల్ పోస్ట్
Published on Sun, 08/22/2021 - 13:08
Happy Birthday chiranjeevi: ‘చిరంజీవి నాకే కాదు ఎందరికో మార్గదశి, స్పూర్తి ప్రదాత, ఆదర్శప్రాయుడు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం’అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆదివారం(ఆగస్ట్22) చిరంజీవి బర్త్‌డే. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన తమ్ముడు, హీరో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
(చదవండి: ‘ఆచార్య’ అదిరిపోయే వీడియో.. చెర్రీ ఎమోషనల్ పోస్ట్)
చిరంజీవిని అభిమానించే లక్షలాదిమందిలో తాను తొలి అభిమానినని, ఆయనను చూస్తూ, ఆయన సినిమాలను వీక్షిస్తూ.. ఆయన ఉన్నతి కనులారా చూశానని పవన్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం అని కొనియాడారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారని, కోరిన ప్రతి ఒక్కరికీ సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారని ప్రశంసించారు. అన్నగా పుట్టినప్పటికీ తమను తండ్రిలా సాకారని, అన్నయ్యకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అంటూ చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్ చెప్పారు.
(చదవండి: చిరు బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది..‘భోళా శంకర్’గా మెగాస్టార్)
Tags : 1