Breaking News

సినిమాల్లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌

Published on Tue, 03/25/2025 - 09:29

ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌ కల్యాణ్(Pawan Kalyan)  సినీరంగంలో కొనసాగుతారా..? మళ్లీ కొత్త సినిమాలు చేస్తారా..? అని అభిమానుల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ విషయంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్‌ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలు ఉన్నాయి. అయితే, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మాత్రం రావడం కష్టమేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఈ మూడు సినిమాల కోసం పవన్‌ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. దీంతో నిర్మాతలకు బడ్జెట్‌ పెరిగి తలనొప్పిగా మారిందని కూడా చెబుతున్నారు.

తమిళ మీడియాకు ఇచ్చిన ఒక  ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. తనకు  డబ్బు అవసరం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే, తాను సినిమా నిర్మాణరంగంలో మాత్రం భాగం కానన్నారు.  'నాకు ఉన్న ఏకైకా ఆదాయమార్గం నటన మాత్రమే.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను.' అని పవన్‌ అన్నారు. 2020 ముందు వరకు పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌ కేవలం రూ. 15 కోట్ల లోపు మాత్రమే అని ఇండస్ట్రీలో చెబుతున్న మాట.. అయితే, వకీల్‌సాబ్‌ సినిమా నుంచి ఆయన రూ. 50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)