Breaking News

ఫ్యాన్స్‌ ఓజీ అని అరుస్తుంటే బెదిరింపుల్లా ఉన్నాయి: పవన్‌ కల్యాణ్‌

Published on Mon, 12/30/2024 - 19:22

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ఎట్టకేలకు పవన్‌.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలపై స్పందించాడు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ..అభిమానులు ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.

డేట్స్‌ ఇచ్చా..
నేను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్‌ ఇచ్చాను. కానీ నిర్మాతలే సరిగా వినియోగించుకోలేదు. హరిహర వీరమల్లు మూవీ (Hari Hara Veeramallu Movie) షూటింగ్‌ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఇంకా స్క్రిప్టు పనులే జరుగుతున్నాయి. ఈ మూడు చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాను అని తెలిపారు. హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఇది పీరియాడిక్‌ ఫిలింగా తెరకెక్కనుంది. 

(చదవండి: అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం కరెక్టే: పవన్‌ కల్యాణ్‌)

సినిమా..
క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఓజీ విషయానికి వస్తే సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్‌ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్‌ దాస్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025వ సంవత్సరంలో రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

చదవండి: పడుచు హీరోయిన్లతో సీనియర్‌ హీరోల రొమాన్స్‌.. 'తప్పేముంది?'

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)