Breaking News

పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ

Published on Sun, 04/20/2025 - 17:36

బిగ్ బాస్ షోతో పరిచయమై.. దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకున్న జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అబ్బాయి ముస్లిం అయినప్పటికీ.. ఆమ్మాయి ఇష్టప్రకారం హిందు సంప్రదాయంలోనే పెళ్లి జరగడం విశేషం.

(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇ‍ప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)

2012 నుంచి సినిమాలు చేస్తున్న నటి పావని రెడ్డి.. తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 తదితర చిత్రాలు చేసింది. తమిళ, తెలుగులో పలు సీరియల్స్ కూడా చేసి గుర్తింపు తెచ్చుకుంది.

పావనికి ఇదివరకే 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లయింది. పావని ఓ తెలుగు సీరియల్ చేస్తున్న టైంలో ఇతడి పరిచయమయ్యాడు. కాకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్ లోకి వెళ్లిన ఈమె.. దాన్నుంచి తేరుకుని షోలు చేయడం మొదలుపెట్టింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)

అలా తమిళంలో బిగ్ బాస్ 5వ సీజన్ లో పావని పాల్గొంది. ఇదే షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెకి విషయం చెబితే తొలుత నో చెప్పింది గానీ కొన్నాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా 2022 నుంచి ఆమిర్-పావని రెడ్డి రిలేషన్ షిప్ లో ఉన్నారు.

దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పలు షోల్లోనూ జంటగా పాల్గొని విజేతగానూ నిలిచారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి గురించి పావని బయటపెట్టింది. ఇప్పుడు హిందూ సంప్రదాయంలో ఆమిర్-పావని పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే అందరూ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్)

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)