Breaking News

తెరపైకి ముత్తురామలింగ దేవర్‌ బయోపిక్‌..

Published on Mon, 11/03/2025 - 07:28

తమిళనాడులో ఒక వర్గం దైవంగా భావించే నాయకుడు పసుమ్‌పొన్‌ ముత్తురామలింగదేవర్‌. సామాజిక సేవకుడిగా పేరు గాంచిన ఈయన తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌గా పేరొందిన ముత్తురామలింగ దేవర్‌ పార్లమెంట్‌ సభ్యుడుగా దేశ రాజకీయాల్లోనూ రాణించారు. బ్రిటిష్‌ కాలంలోనే గాంధీజీ అహింసా వాదాన్ని వ్యతిరేకించి సుభాష్‌ చంద్రబోస్‌ సిద్ధాంతాన్ని ఆచరించి ఆయనతో పయనించారు. 

అలా సుభాష్‌చంద్రబోస్‌తో పాటు నిషేధాని ఎదుర్కొన్న నాయకుడు ముత్తురామలింగ దేవర్‌. తమిళనాడులో 1953 ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచి కామరాజ్‌ను రాజకీయ నాయకుడిని చేసిన ఘనత ఇతనిది. ఆ తరువాత విభేదాలు కారణంగా కాంగ్రెస్‌ పార్టీని వీడి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి ప్రాతినిథ్యం వహించి ముత్తురామలింగదేవర్‌ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ నిర్ణయాలనే విభేదించారు. 

నేరారోపణలు కారణంగా జైలు జీవితాన్ని అనుభవించి, న్యాయ విచారణలో నిర్దోషిగా తిరిగొచ్చి ప్రజాసేవలోనే గడిపిన ఆయన ఆజన్మ బ్రహ్మచారి అన్నది విశేషం. తన ఆస్తిని తన అనుచరులకు పంచిన ఘనత ఇతనిది. అలాంటి ప్రజాసేవకుడు పసుమ్‌పొన్‌ ముత్తురామలింగ దేవర్‌ జీవిత చరిత్ర ఇప్పుడు దేశీయ తలైవన్‌ పేరుతో చిత్రంగా రూపొందింది. ఎస్‌ఎస్‌ఆర్‌.సత్య పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ఆర్‌ సత్య నిర్మించిన ఈ చిత్రానికి ఆర్‌.అరవింద్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. ముత్తురామలింగ దేవర్‌ పాత్రలో బషీర్‌ నటించగా, దర్శకుడు భారతిరాజా, రాధారవి, వైగై చంద్రశేఖర్‌, ఎంఎస్‌ భాస్కర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు అరవింద్‌రాజ్‌ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం దేవర్‌ 118వ జయంతి సందర్భంగా అక్టోమర్‌ 31న విడుదలైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)