Breaking News

'నా సామిరంగ'లో అది న‌చ్చ‌లేదు.. ఇలా చేసుంటే క‌లెక్ష‌న్స్‌..

Published on Sat, 02/24/2024 - 17:01

నాగార్జున అక్కినేని. అల్ల‌రి న‌రేశ్‌, రాజ్ త‌రుణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ నా సామిరంగ‌. ఆషిక రంగ‌నాథ్‌, మిర్నా మీన‌న్‌, రుక్స‌ర్ ధిల్లాన్ హీరోయిన్లుగా న‌టించారు. 'పొరింజు మరియమ్‌ జోస్‌' అనే మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రానికి ఇది రీమేక్‌గా వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన ర‌చ‌యిత ప‌రుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌లో రివ్యూ ఇచ్చాడు.

ఆ టెక్నిక్ ఫాలో కావ‌ట్లే..
ఆయన మాట్లాడుతూ.. 'సినిమా బాగుంది. కానీ వ‌సూళ్లు అంత‌గా రాలేవు. ఏ ద‌ర్శ‌కుడికైనా, ర‌చ‌యిత‌కైనా, న‌టుడికైనా సంతృప్తినిచ్చే సినిమాలు కొన్నుంటాయి. ఈ మూవీ ఆ జాబితాలోకే వ‌స్తుంది. దిగ్గ‌జ డైరెక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు టెక్నిక్‌ను చాలామంది యువ‌ద‌ర్శ‌కులు ఫాలో అవ‌డం లేదు. ఆయ‌న సినిమాలో ఆఖ‌రి అర‌గంటే చిత్రానికి గుండెకాయ‌. అప్ప‌టివ‌ర‌కు ఎలా ఉన్నా చివ‌ర్లో మాత్రం ప్రేక్ష‌కులు క‌న్నార్ప‌కుండా చూసేవారు. 

క‌ళ్ల‌తో న‌టించారు
నా సామిరంగ మూవీ విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్టాఫ్‌లో రొమాన్స్‌కు ప్రాధాన్య‌మిచ్చారు. నాగార్జున గ‌డ్డం పెంచి, లుంగీ క‌ట్టి కొత్త‌గా క‌నిపించారు. కిష్ట‌య్య పాత్ర‌ను ప్రేమించారు. త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. క‌ళ్ల‌తో న‌టించారు. ఎప్పుడూ కామెడీ పండించే అల్ల‌రి న‌రేశ్ ఎక్కువ ఫైట్లు చేశాడు. ఇంట‌ర్వెల్‌లో రావు ర‌మేశ్ పాత్ర‌ను ముగించ‌కుండా ఉంటే బాగుండ‌నిపించింది. ఇంట‌ర్వెల్‌లో ఆయ‌న పాత్ర క్లోజ్ చేయ‌డంతో సెకండాఫ్‌లో కొత్త విల‌న్ వ‌స్తాడ‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడికి సులువుగా తెలిసిపోతుంది. కూతుర్ని భ‌య‌పెట్టే క్ర‌మంలో నిజంగానే ఆయ‌న పాత్ర చ‌నిపోతుంది. ఈ పాత్ర‌ను అంతం చేయ‌కుండా అలాగే కొన‌సాగిస్తే సెకండాఫ్ ఇంకా బాగుండేద‌నిపించింది.

ప్రేక్ష‌కులు భ‌రించ‌లేరు
అల్ల‌రి న‌రేశ్ పాత్ర‌ను కూడా ముగించ‌కుండా ఉండాల్సింది. ఎందుకంటే హీరో ప‌క్క‌న ఉన్న‌వాళ్ల‌ను చంపుకుంటూ పోతే ప్రేక్ష‌కులు భ‌రించ‌లేరు. హీరో విల‌న్ల‌ను చంపుకుంటూ పోతే సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది, అదే విల‌న్‌.. హీరో మ‌నుషుల‌ను చంపుకుంటూ పోతే సినిమా దెబ్బ‌తింటుంది. అయినా ల‌క్కీగా ఈ సినిమా బ‌య‌ట‌ప‌డింది. నాజ‌ర్ పాత్ర చివ‌ర్లో చేసిన ప‌ని కూడా న‌చ్చ‌లేదు. సెకండాఫ్‌లో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉండుంటే మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ వ‌చ్చుండేవి' అని చెప్పుకొచ్చాడు.

చ‌ద‌వండి: విజ‌య‌కాంత్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌.. నేను వ‌ద్ద‌ని తెగేసి చెప్పారు

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)