Breaking News

అహం.. అలా చేసుంటే ఇంకా బాగుండేది: పరుచూరి

Published on Sat, 08/17/2024 - 17:20

ఒకే ఒక్క క్యారెక్టర్‌.. గంటన్నర సినిమా.. సుమంత్‌ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అహం- రీబూట్‌. ఆహాలో రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమాపై దర్శకరచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో రివ్యూ ఇచ్చారు.

అలా చేసుంటే..
ఆయన మాట్లాడుతూ.. రేడియో జాకీగా పని చేసే ఓ యువకుడి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఒకే పాత్రతో సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒకే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం. ఇందులో సోలోమ్యాన్‌ షోలా కాకుండా ప్రియురాలి పాత్రను నెమరువేసుకునే సన్నివేశాలు రూపొందించి ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు ప్రేక్షకులు సినిమాను ఇంకా బాగా చూసేవారు.

తాపత్రయం బాగుంటుంది
సినిమా గురించి మరింత మాట్లాడుతూ.. తన జీవితంలో ఒకరిని కోల్పోయినందుకు చనిపోదామనుకునే దశ నుంచి దాన్నుంచి బయటపడటం అనేది మంచి సందేశం. తన జీవితంలో జరిగిన సంఘటన మరొకరి జీవితంలో జరగకూడదని హీరో పడే తాపత్రయం బాగుంటుంది. చిన్నచిన్న సమస్యలకే ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మంచిది కాదని సినిమాలో చక్కగా చెప్పారు.

ప్రయోగాలు ఆపకూడదు
నూతన ఒరవడి కోసం ఇలాంటి సినిమాలను అప్పుడప్పుడు చూడాలి. కొన్నిసార్లు ప్రయోగాలు అద్భుత విజయాలను సాధిస్తాయి. మరికొన్నిసార్లు దెబ్బతింటాయి. దెబ్బతిన్నాం కదా అని ప్రయోగాలు ఆపకూడదు అని పేర్కొన్నారు. కాగా సుమంత్‌ హీరోగా నటించిన అహం మూవీకి ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించాడు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)