‘ది ప్యారడైజ్‌’ మూవీ ఫస్ట్‌ రివ్యూ: ఆ సీన్లకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

Published on Wed, 09/23/2026 - 17:21

‘ది ప్యారడైజ్‌’.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో పాటు సినిమాపై భారీ హైప్‌  క్రియేట్‌ చేశాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రిమియర్స్‌పడబోతున్నాయి. అసలు ఈ సినిమా కథేంటి? సెన్సార్‌ సభ్యులను సైతం భయపట్టిన సన్నివేశాలు ఏంటి? ఇప్పటివరకు ఈ సినిమా గురించి బయటకు వచ్చిన టాక్‌ ఎలా ఉంది? ఫస్ట్‌రివ్యూలో చూద్దాం.

సెన్సార్‌  టాక్‌.. 
ఈ చిత్రానికి సెన్సార్‌  ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. తీవ్రమైన రక్తపాతం, రా అండ్ రస్టిక్ యాక్షన్ దృశ్యాల కారణంగా 18 ఏళ్ల పైబడిన వాళ్లు మాత్రమే సినిమా చూడాలంటే ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది. నాని సైతం ఈ సినిమాకు చిన్న పిల్లలను తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయెలెన్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా మొత్తం చూసి సెన్సార్‌  సభ్యులు ఈ మధ్యకాలంలో ఇలాంటి వయెలెన్స్‌ చిత్రం చూడలేదని చెప్పారట. మొత్తం 21 మార్పులు సూచించారట. అలాగే కొన్ని అభ్యంతరకరమైన డైలాగులను మ్యూట్‌ చేశారు.  సెన్సార్‌ తర్వాత ఈ సినిమా రన్‌ టైమ్‌ 2.45 గంటలకు ఫైనల్‌ చేశారు.  

(చదవండి: ‘ది ప్యారడైజ్‌’కి పెట్టింది ఎంత? రావాల్సింది ఎంత?)

ప్యారడైజ్‌ కథేంటి?
ఇప్పటివరకు వచ్చిన టాక్‌ ప్రకారం.. ఈ సినిమా కథ ఇలా సాగుతుందట. 1984 కాలంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌  పరిసర ప్రాంతల్లో నివసించే సంచార జాతీ సవారీలకు గుర్తింపు ఉండదు. వాళ్లు అసలు జనాభ లెక్కల్లో ఉండరు. అలా బాగా అణచివేతకు గురైన సవారీల జాతికి చెందిన యువకుడే జడల్‌ జమానా(నాని). మొదట్లో అందరిలా బతికే జడల్‌..  శికంజ మాలిక్(మోహన్ బాబు), అతని కొడుకు(రాఘవ్ జుయల్) తన జాతిపట్ల చూపించే వివక్షను తట్టుకోలేక ఎదురు తిరుగుతాడు. తన జాతి గుర్తింపు కోసం జడల్‌ చేసిన పోరాటం ఏంటి? అణచివేతకు గురైన ఒక సమూహానికి, ఒక నియంతృత్వ శక్తికి మధ్య జరిగే సుదీర్ఘ పోరాటమే ఈ సినిమా మిగతా కథ.

హైలెట్స్‌ ఇవే!
ఈ సినిమా సినిమా ప్రధానంగా నాలుగు భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయట. అవి సినిమాకే హైలెట్‌ అని చిత్రబృందం చెబుతోంది. ఇక ఇంటర్వెల్‌ సీన్‌ అయితే ఊహించని విధంగా ఉంటుందట. కథ ప్రారంభం అయినా కాసేపటికే అందరూ ప్యారడైజ్‌ ప్రపంచంలోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. ఇక చివరి 40 నిమిషాలు అయితే మరింత ఆసక్తికరంగా సాగుతుందట. భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు చాలా సర్‌ప్రైజులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

(చదవండి: ది ప్యారడైజ్‌.. నాని, మోహన్ బాబు, కీర్తి సురేశ్.. పారితోషికం ఎంతెంత?)

నాని కెరీర్‌ బెస్ట్‌  ఫెర్పార్మెన్స్‌ ఇచ్చాడట. అలాగే అనిరుధ్‌  బీజీఎం అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. యాక్షన్‌ మాత్రమే కాదు ఎమోషనల్‌ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయట. సినిమా పూర్తయిన తర్వాత బరువైన హృదయంతో బయటకు వస్తారట. ఇక వయెలెన్స్ విషయానికొస్తే..ఇంతకు ముందు తెలుగు తెరపై చూడని భయంకరమైన సన్నివేశాలు ఉన్నాయట. సలసలకాగే ఆయిల్ లో పడి కాలడం, మహిళలతో బలవంతంగా బట్టలు విప్పించడం మహిళలను వేలంలో అమ్మడం.. నాని తనకి తాను దిష్టి తీసుకునే క్రమంలో శరీరం అంతా రక్తసిక్తం కావడం లాంటి  సన్నివేశాలు స్ర్కీన్‌పై చూస్తుంటే కాస్త ఇబ్బందిగా, భయంకరంగానే ఉంటాయట. 

(చదవండి: ది ప్యారడైజ్‌ మూవీ స్పెషల్‌.. థియేటర్స్‌లో సర్వపిండి!)

తల్లి, కొడుకు ఎమోషన్‌  ఈ సినిమాకు మరో ప్రధాన బలమని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన టాక్‌ అయితే సినిమా హిట్‌ అన్నట్లుగానే ఉంది. మరి ఇందులో నిజమెంత? ఈ వయెలెంట్‌ ఎమోషనల్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. 

Videos

Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యక్షప్రసారం

నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి

DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు

మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు

ఓరి మీ దుంప తెగ.. ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టమకండయ్యా స్వామి...

రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా

కాకుమానుది మరణం కాదు.. ప్రభుత్వ హత్య.. కింద పడేసి తొక్కిన పోలీసులు.. సంచలన వీడియో

రూ 450 నుంచి లక్షల వేలం వరకు.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే..!

Watch Live: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రత్యక్షప్రసారం

సాయికృష్ణకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం బయటపడకూడదనే బూడిద చేశారు

Photos

+5

‘ది ప్యారడైజ్’ మూవీ ట్రెండింగ్ లో హీరోయిన్‌ కయాదు లోహర్ (ఫొటోలు)

+5

ఫరియా అబ్దుల్లా ‘సిగ్మా’ సినిమా (ఫొటోలు)

+5

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)