Breaking News

నాని ది ప్యారడైజ్.. రిలీజ్‌ డేట్‌పై మరోసారి క్లారిటీ

Published on Sun, 09/06/2026 - 11:54

నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్‌ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ దీంతో సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసే ఆలోచన లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

 

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)