వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
ఏమయ్యా రాహుల్... గిదా పద్దతి?, దావత్ ఇయ్యాలే: కేసీఆర్ స్టైల్‌లో ప్రియదర్శి రిప్లై
Published on Sat, 09/26/2026 - 12:04
ది ప్యారడైజ్’ సినిమా చూసిన ప్రేక్షకులకు నాని పాత్రతో పాటు మరో క్యారెక్టర్ కూడా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదే ఎమ్మెల్యే శంకరన్న పాత్ర. ఈ పాత్రలో ప్రియదర్శి కనిపించిన తీరు ప్రేక్షకులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. లుక్ దగ్గర నుంచి మాట తీరు, హావభావాలు, డైలాగ్ డెలివరీ వరకు ఆయన చూపించిన విధానం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉండటంతో థియేటర్లలో ప్రత్యేకమైన స్పందన వచ్చింది. రిలీజ్ వరకు ఈ పాత్రకు సంబంధించిన విషయాలను మేకర్స్ పూర్తిగా సీక్రెట్‌గా ఉంచడంతో.. తెరపై ప్రియదర్శిని చూసిన ఆడియన్స్‌కు ఇది బిగ్ సర్‌ప్రైజ్‌గా మారింది.
‘ది ప్యారడైజ్’లో ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి తనదైన నటనతో అదరగొట్టారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించే ఆయన.. ఈ సినిమాలో ప్రజల కోసం నిలబడే నేతగా కనిపించారు. ఆయన లుక్‌ను గమనించిన ప్రతిసారీ కేసీఆర్ గుర్తుకు వచ్చేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పాత్రను డిజైన్ చేశారు. ముఖ్యంగా ముక్కు ఆకారం, హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు.. ఇలా ప్రతి అంశంలోనూ కేసీఆర్ ఛాయలు కనిపించేలా ప్రియదర్శి నటించారు.
అయితే ఈ పాత్రను కేవలం ఇమిటేట్ చేయడంతోనే ఆపకుండా.. తనదైన నటనతో ప్రియదర్శి మరింత ఆసక్తికరంగా మలిచారు. సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నానికి ఎంతగా పేరు వచ్చిందో.. శంకరన్న పాత్రలో ప్రియదర్శికి కూడా అదే స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం ఆయన పేరు మారుమోగుతోంది.
(చదవండి: నాని 'ప్యారడైజ్'కి రెండు రోజుల్లో ఎంతొచ్చాయ్?)
ఈ నేపథ్యంలో ప్రియదర్శి నటనపై తోటి నటుడు రాహుల్ రామకృష్ణ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రియదర్శిని ఉద్దేశిస్తూ ‘బాపూ.. ఇచ్చి పడేసినావు’ అంటూ రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేశారు. దీనికి ప్రియదర్శి కూడా తన పాత్రను గుర్తుచేసేలా సరదాగా స్పందించారు. కేసీఆర్ గతంలో చేసిన ఓ వ్యాఖ్యను గుర్తుచేస్తూ.. ‘ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్లని కోసి దావత్ ఇయ్యాలే’అంటూ రిప్లై ఇచ్చారు.
ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ మధ్య జరిగిన ఈ సరదా సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ది ప్యారడైజ్’లో శంకరన్న పాత్రను మేకర్స్ ఇంతకాలం రహస్యంగా ఉంచడం.. ఇప్పుడు ఆ పాత్రకు వస్తున్న స్పందన సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారడం విశేషం. ముఖ్యంగా కేసీఆర్‌ను పోలిన లుక్, డైలాగ్ డెలివరీతో ప్రియదర్శి తెరపై కనిపించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి ‘ది ప్యారడైజ్’తో ప్రియదర్శికి మరో గుర్తుండిపోయే పాత్ర దక్కిందనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
Em vy Rahulluuu
Gidha padhathi
Gorre pilla kosi dawat iyyale
🫂— Priyadarshi Pulikonda (@Preyadarshe) September 24, 2026
Tags : 1