Breaking News

Papam Prathap Review: పాపం ప్రతాప్‌ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 04/17/2026 - 09:08

చిన్న సినిమాలతో మంచి విజయాలు అందుకుంటున్న తెలుగు హీరో తీరువీర్‌. మసూద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తీరువీర్‌..  పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్‌. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ ‘ప్రతాప్‌’ అందుకున్నాడా? తిరువీర్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్ర‌తాప్ (తిరువీర్‌)కి బుజ్జమ్మ(పాయల్‌ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్‌ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్‌ ఘోష్‌)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్‌కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని స‌మ‌స్యేమిటో త‌నే తెలుసుకుని స‌రిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా?‍ చివరకు బుజ్జమ్మ, ప్రతాప్‌ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 



ఎలా ఉందంటే..
ఓ సున్నితమైన సమస్య చుట్టు తిరిగే కథ ఇది. ప్రేమ ఒకవైపు.. వింత సమస్య మరోవైపు.. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణలో ఏది పై చేయి సాధించింది అనేదే ఈ కథలో కీలకం. యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని  దర్శకుడు ఎస్పీ దుర్గా నరేశ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆయన ఎంచుకున్న పాయింట్‌ చాలా చిన్నది. దానికి పల్లెటూరి వాతావరణం,  ఫ్యామిలీ ఎమోషన్స్‌ని యాడ్‌ చేసి ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. 

బుజ్జమ్మ, ప్రతాప్‌ల చిన్నప్పటి లవ్‌స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది.  ఆ వెంటనే వారిద్దరిని పెద్దవాళ్లుగా పరిచయం చేసి.. పెళ్లి,  తర్వాత ప్రతాప్‌ సమస్యను తెలియజేసి అసలు కథలోకి తీసుకెళ్లాడు.  అయితే ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటనేది వెంటనే చెప్పకుండా... కాసేపటి వరకు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా చేశాడు.  పంచాయితీలో ఆ సమస్య గురించి చెప్పినప్పుడు.. దీనికి ఎందుకు పంచాయితీ పెట్టడం అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక్కో విషయం తెలిసేకొద్ది.. నిజంగానే అది పెద్ద సమస్య అనిపిస్తుంది. అయితే పెళ్లి అయిన వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా.. పంచాయితీ పెట్టడం అనేది కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. 

అలాగే ఆ  సమస్యకి.. ప్రతాప్‌ ప్రేమకి ముడిపెట్టడం కూడా అతికినట్లుగా అనిపించదు.  అయితే హీరో సమస్య గురించి ఊర్లో వాళ్లు రకరకాలుగా మాట్లాడడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కొంతమేర నవ్వులు పూయిస్తాయి.  ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాప్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక కీలకమైన ద్వితియార్థంతో కథనం నెమ్మదిగా సాగడం..  అటు కామెడీ సరిగా పండక..ఇటు ఎమోషనల్‌ సీన్లు కూడా తేలిపోవడంతో బోర్‌ కొడుతుంది.  హీరోకి ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు చేసే పనులు సిల్లీగా అనిపిస్తుంది.  అయితే ఆ సమస్య ఎలా వచ్చిందో తెలియజేసే ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తుంది.  క్లైమాక్స్‌ బాగుంటుంది. 

ఎవ‌రెలా చేశారంటే..
ఈ మూవీకి ప్రధాన బలం తిరువీర్‌.. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చాలా సినిమాల్లో నటించిన వారికి మాత్రమే సాధ్యపడే పాత్రలో ఆయన మెప్పించారు.  అమాయకత్వంతో ఉన్న  ఈ పాత్రలో సరిగ్గా సెట్‌ అయ్యారు. హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ ఎంపిక కూడా బాగుంది అనిపిస్తుంది. అజ‌య్ ఘోష్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంద శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. ఒకప్పటి హీరోయిన్‌ రాశి..హీరో తల్లిగా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. కె.ఎం.రాధాకృష్ణ‌న్  సంగీతం బాగుంది.  పాట‌లు ప్రేక్షకులను మెప్పిస్తాయి.  సినిమాటోగ్రఫీ విశ్వేశ్వర్‌ ఎస్‌.వి పర్వాలేదనిపిస్తుంది. 

Videos

మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు

లాభాల వరద పారించిన LIC స్టాక్.. 20 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..

మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)