Breaking News

సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌.. మళ్లీ వచ్చేస్తోంది

Published on Thu, 04/03/2025 - 16:04

ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు. ఏ సినిమా అయినా.. వెబ్ సిరీస్‌ ‍అయినా ఓటీటీలోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ  నేపథ్యంలోనే సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‍‍అయితే ఓటీటీల్లోనూ కంటెంట్‌ బాగుంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగానే ఉన్నాయి. వాటిలో పంచాయత్ వెబ్ సిరీస్‌ ఒకటి.

ఇప్పటికే  విడుదలైన మూడు సీజన్స్‌కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్‌ విడుదలైతే.. 2022లో రెండో సీజన్‌.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను ‍అలరించాయి. ఈ వెబ్ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న నాలుగో సీజన్‌ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ విషయాన్ని ప్రత్యేక వీడియో రిలీజ్ చేస్తూ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్‌ తొలి సిరీస్ విడుదలై ఐదేళ్లు పూర్తి కావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగో సీజన్ ‍స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. పంచాయత్ సీజన్- 4 ఈ ఏడాది జూలై 2న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. 

కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు.

 

 

 

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)