Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన 'పంచాయత్' కొత్త సీజన్

Published on Tue, 06/24/2025 - 09:47

ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది కానీ లాక్ డౌన్ టైంలో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటి ఓ సిరీస్ 'పంచాయత్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్‌గా ఈ సిరీస్‌కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. గత మూడు సీజన్లు చూసేసిన చాలామంది కొత్త సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)

జితేంద్ర కుమార్‌, నీనా గుప్తా, రఘువీర్‌ యాదవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు దీపిక్‌ కుమార్‌ మిశ్రా, అక్షత్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇ‍ప్పుడు నాలుగో సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది.

పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ. తొలి మూడు సీజన్లు వివిధ అంశాల ఆధారంగా తెరకెక్కించారు. నాలుగు సీజన్‌లో పంచాయతీలో జరిగే ఎన్నికల స్టోరీతో తీశారు. ఈసారి కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్‌గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.

(ఇదీ చదవండి: మరో హీరోయిన్‌తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)