Breaking News

ముందుగానే వచ్చేస్తోన్న పంచాయత్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

Published on Wed, 06/11/2025 - 14:46

ఓటీటీలు వచ్చాక సినీ వినోదం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. థియేటర్లలో కేవలం సినిమాలే కాదు.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్‌లకు ప్రత్యేకమై క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సరికొత్త సిరీస్ పంచాయత్‌. ఇప్పటికే  విడుదలైన మూడు సీజన్స్‌కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్‌ విడుదలైతే.. 2022లో రెండో సీజన్‌.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను ‍అలరించాయి. ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆదరణ దక్కడంతో మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇంకాస్తా తొందరగానే స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు.

విలేజ్ నేపథ్యంలో సాగే సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న నాలుగో సీజన్‌ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్- 4 జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మొదట జూలై 2న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తాజాగా తేదీ మారడంతో ఈ వెబ్ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లో ఈనెలలోనే సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది.

కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు.
 

 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)