Breaking News

ఫన్నీగా 'పైలం పిలగా'.. ట్రైలర్‌ చూశారా?

Published on Mon, 09/16/2024 - 19:40

సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించిన చిత్రం పైలం పిలగా. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేశారు. పల్లె నుంచి పట్నం దాకా ఈ గ్లోబలైజేషన్ యుగంలో యువత ఉద్యోగాల కన్నా సొంత స్టార్ట్ అప్‌లు, వ్యాపారాల వైపే పరుగులు పెడుతున్నారు. కోట్లు సంపాదించాలని కలలు కంటున్నారు. 

ఇలాగే ఓ యువకుడు తన ఊళ్లోనే, తన భూమిలోనే సొంత వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలనుకుంటాడు. కానీ పంచాయితీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ ఆఫీస్ వరకు సవాళ్లు, అవినీతి, అలసత్వం నిండిన బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కొని ఎన్ని బాధలు పడ్డాడో  తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే పైలం పిలగా. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి  డైరెక్షన్‌ చేసిన ఆనంద్ గుర్రం ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. 

ఈ చిత్ర ట్రైలర్  రిలీజ్ సందర్బంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు ఆనందం గుర్రం రాసిన  'ఊరెళ్ళిపోతా మావ', 'కంచె లేని దేశం' పాటలకు పెద్ద అభిమానిని, ఇప్పుడు ఈ సినిమాలో పాటలు కూడా  చాలా బాగున్నాయి. సినిమా ట్రైలర్ మంచి డైలాగ్స్ తో చాలా ఇంట్రెస్టింగా ఉంది అన్నారు.

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే.శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించగా సందీప్ బద్దుల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)