Breaking News

సెన్సార్‌ బోర్డుపై దర్శకుడు ఫైర్‌.. నా సినిమా అంటే చాలు..

Published on Thu, 02/01/2024 - 12:49

దర్శకుడు పా.రంజిత్‌ చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అదే సమయంలో సెన్సార్‌ బోర్డు నుంచి సమస్యలూ ఎదురవుతుంటాయి. తాజాగా ఆయన సొంత బ్యానర్‌ 'నీలం ప్రొడక్షన్స్‌' సమర్పణలో తెరకెక్కిన బ్లూస్టార్‌ మూవీకి ఈ చిక్కులు తప్పలేవు. అశోక్‌ సెల్వన్‌, శాంతను, పృథ్వీ పాండియరాజన్‌, కీర్తిపాండియన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జై కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెల 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

బ్లూస్టార్‌కు ఎలాంటి సమస్యలు ఉండవనుకున్నా..
ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా పా.రంజిత్‌ మాట్లాడుతూ.. నీలం ప్రొడక్షన్స్‌ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటేనే ఏదేదో ఉంటుందని సెన్సార్‌ బోర్డు సభ్యులు అలర్ట్‌ అవుతున్నారని ఫైర్‌ అయ్యారు. బ్లూస్టార్‌ చిత్రానికి ఎలాంటి సమస్యలు రావని భావించానని, అయితే ఈ చిత్రం విడుదల కాకూడదని అక్కడే కొందరు అనుకోవడం మొదలెట్టారని చెప్పారు. అది విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు.

ఆయనను రౌడీ అన్నారు
ఈ చిత్రాన్ని ఎందుకు విడుదల చేయకూడదని ప్రశ్నించగా ఇది ఓ వర్గానికి అనుకూలంగా ఉందని చెప్పారు. నాయకుడు పూవై జగన్‌ మూర్తియార్‌ కథలా అనిపిస్తోందన్నారు. ఆయనను ఒక రౌడీగా అభివర్ణించినట్లు తెలిపారు. పూవై మూర్తియార్‌ తమను చదివించారని, ఆయన పెద్ద నాయకుడు అని, ఆయన్ని ఎలా రౌడీ అంటారని ప్రశ్నించానన్నారు. తాను ఎంత వాదించినా సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెప్పారు. దీంతో రివైజింగ్‌ కమిటీకి వెళ్లి అక్కడ చెప్పిన కొన్ని మార్పులు చేసి బ్లూస్టార్‌ రిలీజ్‌ చేయగా అదిప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. సమైక్యతను చాటి చెప్పే చిత్రానికి సెన్సార్‌ సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు.

చదవండి: విజయ్‌ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)