Breaking News

'బిర్సా ముండా' జీవితంపై పా. రంజిత్‌ సినిమా ప్రకటన

Published on Sat, 08/31/2024 - 08:46

విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తంగలాన్‌ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈమేరకు చిత్ర యూనిట్‌ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమా తాజాగా హిందీ వర్షన్‌తో బాలీవుడ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భం డైరెక్టర్‌ పా.రంజిత్‌ తన కొత్త సినిమా గురించి వెల్లడించారు. ఈసారి  హిందీలో స్ట్రెయిట్‌ సినిమా కోసం స్క్రిప్ట్‌ సిద్ధం చేశానని, దానికి 'బిర్సా ముండా' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్‌ చేసినట్లు పా.రంజిత్‌ అధికారికంగా ప్రకటించారు.

పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకొని వాటికి అందరూ మెచ్చేలా కమర్షియల్‌ పంథాలో సినిమా తీస్తారు. అందుకే ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తెరకెక్కించనున్న బిర్సా ముండా చిత్రం కూడా అదే కోవకు చెందినదిగా చెప్పవచ్చు. అయితే, ఇందులో నటించబోయే  నటీనటుల పేర్లు ఆయన వెల్లడించలేదు.

ఎవరీ బిర్సా ముండా
ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా  (1875–1900) జీవిత చరిత్ర చాలా ఎమోషనల్‌గా ముగుస్తుంది. బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనొక జానపద నాయకుడు.  ముండా జాతికి చెందిన బిర్సా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 

22 ఏళ్ల వయసు ( 1897) లోనే  బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడిగా బిర్సా ముండా గుర్తింపు పొందారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)