Breaking News

అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’

Published on Wed, 06/11/2025 - 16:18

తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్‌ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్‌ కాబోతున్న తమిళ బ్లాక్‌ బస్టర్‌ చిత్రమే డాడా. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ  చిత్రం  తమిళ్‌లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో పాపా పేరుతో రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. "పా పా" చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ -బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. "డా డా " సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో "పా పా" పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు.

 ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ - మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ "పా పా". ఈ చిత్రం తమిళంలో"డా డా " పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)