Breaking News

స్క్విడ్‌ గేమ్‌ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్‌, అందరికీ రుచిస్తుందా?

Published on Sun, 06/29/2025 - 08:52

టైటిల్‌: స్క్విడ్‌ గేమ్‌ వెబ్‌ సిరీస్‌ (మూడో సీజన్‌)
తారాగణం: లీ జుంగ్‌ జే, లీ బ్యుంగ్‌ హు, వి హా జూన్‌
క్రియేటర్‌: హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

చిన్నప్పుడు ఆడిన ఆటలకు లెక్కే లేదు. బడిలో తన్నులు తిన్నా, ఇంట్లో చీవాట్లు పెట్టినా సరే ఫ్రెండ్స్‌తో కలిసి పొద్దేక్కేదాకా ఆడుతుంటే ఆ మజానే వేరుండేది. కానీ, ఆ సరదా ఆటలే ప్రాణాంతకంగా మారితే? గేమ్స్‌ ప్రాణాలు తీస్తే.. అన్న ఆలోచనలో నుంచి వచ్చిందే స్క్విడ్‌ గేమ్‌. డబ్బు, స్వార్థం.. మనిషిని రాక్షసుడిలా మారుస్తుందని, విచక్షణ కోల్పోయేలా చేస్తుందని ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

మొదటి సీజన్‌లో ఏం జరిగింది?
ఈ సిరీస్‌లో రెండు రకాల మనుషులుంటారు. పైసా కోసం ప్రాణాలకు తెగించేవారు.. వారి ప్రాణాలు పోతుంటే చూసి ఆనందించేవారు. తొలి సీజన్‌లో 456 మంది గేమ్‌ ఆడేందుకు వస్తారు. ప్లేయర్‌ 456 (హీరో లీ జుంగ్‌ జే) లక్ష్యం కూడా డబ్బు గెలుచుకోవడమే.. కానీ గేమ్‌ చివరి వరకు వచ్చేసరికి తనముందున్న 455 మంది పిట్టల్లా రాలిపోతారు. అవన్నీ తనను మానసికంగా డిస్టర్బ్‌ చేస్తాయి. కోట్లాది సంపదను గెలుచుకున్నా.. అది తనకు సంతోషాన్ని ఇవ్వదు. మనుషుల ప్రాణాలతో గేమ్‌ ఆడుతున్నవారి అంతు చూడాలని, ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు.. అదే మొదటి సీజన్‌.

రెండో సీజన్‌ ఎలా ముగిసింది?
ప్లేయర్‌ 456 మరోసారి ఆటలో అడుగుపెట్టడంతో రెండో సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ గేమ్‌కు ఎలాగైనా ముగింపు పలకాలని ఆవేశానికి పోయి కొంతమంది ప్లేయర్ల చావుకు కారణమవుతాడు. అంతటితో రెండో సీజన్‌ ఎటువంటి ముగింపు లేకుండానే అర్ధాంతరంగా ఆగిపోతుంది. అసలు ప్లేయర్‌ 456.. ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అన్న ఉత్సుకతో మూడో సీజన్‌ (Squid Game season 3 Review) మొదలవుతుంది.  గేమ్‌ను ఎలాగైనా ఆపేయాలన్న కోపంతో గ్యాంగ్‌ను తయారు చేసుకుని విలన్‌కే ఎదురెళ్తాడు హీరో. 

సిరీస్‌ను మలుపు తిప్పే సంఘటన
ఈ క్రమంలో ఆ గ్యాంగ్‌లోని వారంతా చనిపోతారు. కానీ హీరోను మాత్రం చంపకుండా వదిలేస్తారు. నన్నెందుకు బతికించారు? చంపేయండి అని హీరో విలవిల్లాడతాడు. తనవల్ల ఏదీ మారదని.. ఏది జరగాలనుంటే అది జరుగుతుందని భావించి డీలా పడిపోతాడు. కానీ ఒక్క సంఘటన అతడిలో మళ్లీ శక్తిని, ధైర్యాన్ని నింపుతుంది. వరుసగా ప్రాణాలు పోతున్న ప్రదేశంలో ఓ చిన్నబిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఆ పసిపాప కోసం హీరో మళ్లీ పోరాటం మొదలుపెడతాడు. అప్పుడు సిరీస్‌ వేగం పుంజుకుంటుంది.

విషాదకర క్లైమాక్స్‌
మంచి పైచేయి సాధించినప్పుడే అందరికీ ఆనందం. కానీ, చెడు విజయం సాధించినప్పుడు అది అందరికీ రుచించదు. క్లైమాక్స్‌ చాలామందికి మింగుడుపడదు. దీనికోసమేనా మూడు సీజన్లు సాగదీశారు అనిపిస్తుంది. ప్రాణాంతక ఆటలకు కేంద్రమైన దీవిని కనిపెట్టేందుకు ప్రయత్నించిన డిటెక్టివ్‌ కష్టం కూడా వృథాగా పోతుంది. ఇదే చివరి సీజన్‌ అని ప్రకటించారు కానీ, ఈ క్లైమాక్స్‌ చూస్తుంటే మాత్రం సీజన్‌ 4కూ ఆస్కారం ఉందన్న అనుమానాలు వెలువడుతున్నాయి.

సిరీస్‌ ఏం చెప్తోంది?
డబ్బుకు షార్ట్‌కట్స్‌ ఉండవు. అలాంటి అడ్డదారులున్నాయంటే అది మీ ప్రాణాలతో పందెం కాస్తున్నట్లే లెక్క అని ఈ సిరీస్‌ హెచ్చరిస్తుంది. డబ్బు మనిషిని ఎలా ఏమార్చుతుందని చూపించారు. పసిపాప ప్రాణానికి హీరో తన ప్రాణం అడ్డేసినప్పుడు మంచితనం, మానవత్వం ఇంకా బతికే ఉందని తెలియజేశారు. ఈ సిరీస్‌ విషాదంగా ముగిసింది. చూసే జనాల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)