Breaking News

OTT: 2025లో ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్‌ సిరీస్‌, షోస్‌ లివే..!

Published on Sun, 07/27/2025 - 15:20

2025లో ఇప్పటివరకు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఇంటింటి థియేటర్‌గా అవతరించిన ఓటీటీ రంగం మాత్రం వరుస హిట్‌లు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న సిరీస్‌లతో జోరుగా సాగుతోంది. విశేషం ఏమిటంటే గొప్ప హైప్‌ ఉత్సాహంతో దూసుకొచ్చిన అనేక సిరీస్‌లు విఫలమైతే, తక్కువ మధ్యస్థపు అంచనాలతో వచ్చిన పలు షోలు వాటి ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. అటువంటివాటిలో కొన్ని...

బ్లాక్‌ వారెంట్‌... వావ్‌ కంటెంట్‌...
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన్‌ బ్లాక్‌ వారెంట్‌ ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన అత్యంత ఉత్కంఠభరితమైన షోలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రై మ్‌ థ్రిల్లర్‌ ఇప్పటివరకు లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈ సిరీస్‌లో జహాన్‌ కపూర్, రాహుల్‌ భట్‌ తదితరులు తమ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.

పాతాళ్‌లోక్‌...సూపర్‌ క్లిక్‌
జైదీప్, అహ్లవత్‌ ప్రముఖ పాత్రల్లో నటించిన పాతాల్‌ లోక్‌ సీజన్‌ 2 కూడా మంచి విజయం సాధించింది. ప్రైమ్‌ వీడియో అందిస్తున్న ఈ సంవత్సరపు మరో హిట్‌ థ్రిల్లర్‌ గా నిలిచింది. హై ప్రొఫైల్‌ హత్య కేసు దర్యాప్తు అనుకోని రీతిలో అనేక ఇతర రహస్యాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఈ సిరీస్‌ ప్రదర్శిస్తుంది.

రియలిస్టిక్‌ షేడ్స్‌తో...బ్లాక్‌ వైట్‌ అండ్‌ గ్రే.. లవ్‌కిల్స్‌
నిజజీవిత సంఘటనల ఆధారంగా అంటూ నమ్మించేలా రూపొందిన బ్లాక్, వైట్‌ గ్రే కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోనీలివ్‌ లో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రతీ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. హై–ప్రొఫైల్‌ వ్యక్తుల వరుస హత్యల నేపధ్యంలో ఇది నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పుష్కర్‌ సునీల్‌ మహాబల్, హేమల్‌ ఎ ఠక్కర్‌ లు రూపొందించారు.

సైకలాజికల్‌ థ్రిల్‌...ఖాఫ్‌...
ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉన్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ఖాఫ్‌ కూడా సక్సెస్‌ జోరు కొనసాగిస్తోంది. గత ఏప్రిల్‌ నెలలో విడుదలైన ఈ సిరీస్‌లో... మోనికా పన్వర్, రజత్‌ కపూర్‌ ప్రముఖ పాత్రల్లో నటించిన ఖౌఫ్‌ భయానక శైలి కారణంగా చాలా సంచలనం సృష్టించింది, ప్రేక్షకులపై భారీ ప్రభావాన్ని చూపింది.

ఈ ఓటీటీ షోలను అసాధారణంగా చేసింది దీర్ఘకాలం పాటు కొనసాగే ట్విస్టులతో కథ చెప్పడం, ఏదేమైనా భారతీయ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థ్రిల్లర్ల వైపు పూర్తిగా మొగ్గుతున్నారు మరోవైపు ఈ షోలు 2025లో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కంటే ఓటీటీని రంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చాయి ఈ ఏడాదిలో ఇదే విధంగా తన పైచేయిని కొనసాగిస్తుందా?చూడాలి.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)