ఆస్కార్‌ అవార్డును అమ్ముకోవచ్చా? అమ్మితే ఎంతొస్తుంది?

Published on Sat, 03/11/2023 - 13:32

యావత్‌ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్‌. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని నటీనటులు కలలు కంటారు. మరికొద్ది గంటల్లో ఆస్కార్‌ 2023 వేడుకలు గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. అందులో భారత్‌ నుంచి మన తెలుగు చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు సాంగ్‌ ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీపడుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆస్కార్‌ అవార్డులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చూడటానికి బంగారంలా మెరిసిపోయే ఆస్కార్‌ ప్రతిమ నిజానికి బంగారంతో చేసింది కాదు.  కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు.

ఈ అవార్డు తయారు చేసేందుకు సుమారు  400 డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. కానీ దీన్ని అమ్మితే మాత్రం కేవలం ఒకే ఒక్క డాలర్‌ వస్తుందట. అదేంటీ? ఇంత ప్రాధాన్యత ఉన్న ఆస్కార్‌ అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా అనే కదా మీ సందేహం. 1950కు ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ అమెరికన్‌ డైరెక్టర్‌ ఆర్సన్ వెల్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆస్కార్‌ అవార్డును అమ్ముకోలని చూశాడట.

ఇందుకు తగ్గట్లే వేలం వేయగా ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయట. అయితే ఈ విషయం తెలిసి ఆగ్రహించిన అకాడమీ అవార్డ్స్ కమిటీ ఎవరూ ఆస్కార్ అవార్డు అమ్మకుండా ఓ నిబంధన పెట్టింది. ఆస్కార్‌ విన్నర్స్‌ తమ అవార్డులను ఇతరులకు అమ్మడానికి వీల్లేదట. తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే… ఒక డాలర్ ఇస్తామనే నిబంధన తెచ్చారు. దీంతో ఒక డాలర్‌కి ఆశపడి ఎవరు అవార్డు అమ్ముకోరు కాబట్టి, ఆస్కార్ అవార్డు అమ్మకాన్ని అలా నిరోధించారు.


 

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)