Breaking News

ఆ హీరోయిన్‌ వాళ్ల అమ్మ నన్ను తీవ్రంగా కొట్టింది.. ఓరీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Tue, 11/03/2026 - 13:49

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీ (Orry) బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో తనకున్న స్నేహం, విభేదాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒకప్పుడు సారాతో సన్నిహితంగా ఉన్నానని చెప్పిన ఓరీ.. కష్టకాలంలో ఆమె తనకు అండగా నిలబడలేదని ఆరోపించాడు. అంతేకాదు.. సారా తల్లి, నటి అమృతా సింగ్‌ తనను దూషించారని, ఇప్పటివరకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని, అందుకే  సారా, అమృత ఇద్దరినీ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు వెల్లడించాడు.

నేహా ధూపియా, అంగద్ బేడీ నిర్వహిస్తున్న డబుల్ డేట్ షోలో పాల్గొన్న ఓరీకి.. సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన లేదా అన్‌ఫాలో చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరని ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా సారా అలీఖాన్ పేరు చెబుతూ.. అన్‌ఫాలో చేయడానికి గల కారణాన్ని వివరించాడు.

(చదవండి: 'రామాయణ'కి పైరసీ బెడద.. హైకోర్ట్ కీలక ఆదేశాలు)

సారాతో నాకు చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. కాలేజీ రోజుల్లోనూ ఆ అనుబంధం కొనసాగింది. ఆమె కష్టసమయాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా నిలిచాను. గోవాలో ఓ కేసులో చిక్కుకున్నప్పుడు కూడా నేను ఆమెకు అండగా ఉన్నాను. ఆ సమయంలో చాలామంది సన్నిహితులు ఆమెకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా నేను సారాకు, ఆమె కుటుంబానికి అండగా నిలిచాను. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు సారా కనీసం నా ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయలేదు. కనీసం ఎలా ఉన్నావని అడగలేదు. ఆ సమయంలో ఆమె ప్రవర్తన నన్ను చాలా బాధించింది. 

అందేకాదు ఓ సారి సారా తల్లి అమృత నన్ను తీవ్రంగా కొట్టింది. ఇతరులు దగ్గర నా గురించి బ్యాడ్‌గా చెప్పింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆమె నాకు క్షమాపణలు చెప్పలేదు. అలాంటి వారితో స్నేహంగా ఉండడం ఇష్టంలేక నేను దూరమయ్యాను. అందుకే ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాను’ అని ఓరీ చెప్పుకొచ్చాడు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)