Breaking News

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్

Published on Fri, 06/06/2025 - 13:07

రామ్ చరణ్ 'ఆరెంజ్' ... చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా.. మరో హీరోయిన్‌గా షాజన్ పదమ్సీ చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన 'మసాలా' మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెని గ్రాండ్‌గా ఓ బిజినెస్‪‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే?

మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా.. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్‌కి పరిచయం. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.

(ఇదీ చదవండి: సడన్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‍‌బాస్' శుభశ్రీ)

గత రెండు మూడు రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం.. రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదమ్సీ పెళ్లికి సంబంధించిన ఫొటోలని తన్ ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేస్తోంది.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొళి, ఆరెంజ్, దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్ పన్ నెక్స్ట్ లెవల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టేస్తుందేమో?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)