Breaking News

ఓటీటీలో సైకో థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌

Published on Fri, 11/01/2024 - 17:48

రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. ఈ ఏడాది జులై 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సైకో థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో హీరో రక్షిత్‌ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు.

తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా విడుదలైన ఈ చిత్రం సుమారు నాలుగు నెలలకు ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీలో ప‌లాస 1978 ఫేమ్ ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టించడంతో కాస్త ఆసక్తి కలిగించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 2నుంచి ‘ఆపరేషన్‌ రావణ్‌’ స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఆహా తెలుగు ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.

కథేంటంటే.. 
ఆమని(సంగీర్తన విపిన్‌) ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్‌ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్‌ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్‌ కిల్లర్‌ కేసుని కవర్‌ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్‌(రక్షిత్‌ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్‌ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్‌లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్‌ కిల్లర్‌ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి హత్యలు చేస్తుంటాడు.

ఇలాంటి సమయంలో తన కూతురు  కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్‌ కుమార్‌). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్‌ కిల్లర్‌ ఆమనిని కిడ్నాప్‌ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్‌ చేసిందెవరు? సీరియల్‌ కిల్లర్‌ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్‌ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్‌ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు