Breaking News

'ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎంజాయ్‌'.. స్మూత్‌గా ఇచ్చిప‌డేసిన హీరో

Published on Sat, 02/24/2024 - 20:05

టాలెంట్‌తో కాదు, ఈ మ‌ధ్య కొంద‌రు తెలివి త‌క్కువ ప‌నులు చేసి ఫేమ‌స్ అవుతున్నారు. అడ్డ‌దారుల్లో వెళ్తే ఈజీగా క్లిక్ అవ్వొచ్చ‌ని భావిస్తున్నారు. కానీ దీనివ‌ల్ల విమ‌ర్శ‌లపాల‌వ‌డం త‌ప్ప ఏమీ ఉండ‌ద‌ని తెలుసుకోలేక‌పోతున్నారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని క్లిక్ అయిన మీమ‌ర్స్‌, యూట్యూబ‌ర్స్‌ను కూడా ఇటీవ‌ల‌ సినిమా ఈవెంట్స్‌కు పిలుస్తున్నారు. దీనివ‌ల్ల చిత్ర‌యూనిట్‌కు కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చిప‌డుతున్నాయి. మంచి ప్ర‌శ్న‌లు వేయ‌కుండా అడ్డ‌దిడ్డ‌మైన క్వ‌శ్చ‌న్స్ అడిగి న‌టీన‌టుల‌ను విసిగిస్తున్నారు.

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో..
అభ్యంత‌ర‌క‌ర ప్ర‌శ్న‌ల‌తో హీరోహీరోయిన్స్‌ను అసౌక‌ర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా హీరో సందీప్ కిష‌న్‌కు సైతం ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ఊరుపేరు భైర‌వ‌కోన సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఓ మీమ‌ర్‌ మైక్ అందుకుని పిచ్చి ప్ర‌శ్న‌లు అడిగాడు. ఇద్ద‌రు హీరోయిన్స్‌తో ఎలా ఉంది? ఎలా ఎంజాయ్ చేశావ్‌.. అంటూ రెచ్చిపోయాడు. ఆక‌తాయి హ‌ద్దులు దాటుతున్నా సందీప్ కిష‌న్‌ మాత్రం స్మూత్‌గా హ్యాండిల్ చేశాడు. డ‌బుల్ మీనింగ్ ప్ర‌శ్న‌లు వ‌ద్ద‌ని హెచ్చ‌రించాడు.  

వ‌ద్ద‌ని చెప్పినా కంటిన్యూ చేస్తున్నావ్..
ఇలాంటి పిచ్చి ప్ర‌శ్న‌లు వేయ‌కు.. స్టేజీపై ఆడ‌వాళ్లు ఉన్నారు.. నేను వ‌ద్ద‌ని చెప్పినా కంటిన్యూ చేస్తున్నావ్. ఇది క‌రెక్ట్ కాదు అని చుర‌క‌లు అంటించాడు. దీంతో అత‌డు 'స‌రే, మిమ్మ‌ల్ని ఫాలో అవుతాను. మంచి మాట‌లు చెప్పారు' అంటూ వెట‌కారంగా న‌వ్వాడు. 'నువ్వు ఫాలో అవ్వు, అవ‌క‌పో కానీ.. ఇలాంటివి మాత్రం వ‌ద్దు' అని బుద్ధి చెప్పాడు. ఇది చూసిన నెటిజ‌న్లు టెంప‌ర్ లూజ్ అవ్వ‌కుండా సందీప్ చాలా బాగా ఆన్స‌ర్ ఇచ్చాడ‌ని, త‌న మెచ్యూరిటీని మెచ్చుకోవాల్సిందేన‌ని కామెంట్లు చేస్తున్నారు.

చ‌ద‌వండి: మా సంసారంలో అల్ల‌క‌ల్లోల‌మ‌య్యే గొడ‌వ‌లే లేవు.. మా అనుబంధ‌మే వేరు!

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)