Breaking News

ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటులు వీళ్లే.. ఇండియా నుంచి ఓకే ఒక్కడు!

Published on Mon, 12/30/2024 - 20:16

ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటుల జాబితాను ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండిపెండెంట్  వెల్లడించింది. 21 వ శతాబ్దంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దాదాపు 60 మందితో కూడిన సినీ నటుల పేర్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటుల పేర్లను ఇందులో చేర్చింది. అయితే భారత్ నుంచి ఏ ఒక్క స్టార్ ‍హీరో లేకపోవడం గమనార్హం. బాలీవుడ్‌ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ లిస్ట్‌లో చోటు లభించలేదు.

‍అయితే ఈ 60 ఉ‍త్తమ నటీనటుల జాబితాలో ఇండియా నుంచి ఒక్క నటుడు మాత్రం స్థానం దక్కించుకున్నాడు. అతను మరెవరో కాదు.. విభిన్నమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ నటుడు  ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే ఈ జాబితాలో నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు. 2020లో ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన చనిపోయాక అరుదైన జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

ఇర్ఫాన్ ఖాన్ సినీ ప్రయాణం..

రాజస్థాన్‌లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ ఖాన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటన నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబయికి వెళ్లిపోయారు. ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్‌లో లైఫ్ ఇన్ ఎ మెట్రో, ది డార్జిలింగ్ లిమిటెడ్, స్లమ్‌డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమర్, లైఫ్ ఆఫ్ పై, ది లంచ్‌బాక్స్, కిస్సా, హైదర్, పికు, తల్వార్, హిందీ మీడియం, ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్, ఖరీబ్ ఖరీబ్ సింగ్లే, కార్వాన్, ఆంగ్రేజీ మీడియం లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్​లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణ పూర్తి చేశారు.

టాప్ 10 నటులు వీళ్లే..

2014లో మరణించిన మరో దివంగత నటుడు ఫిలిప్ సేమౌర్ హాఫ్‌మన్ 21వ శతాబ్దపు ఉత్తమ నటుడిగా నిలిచారు. నటీమణుల్లో ఎమ్మా స్టోన్ 2వ స్థానం దక్కించుకుంది. క్రేజీ, స్టుపిడ్, లవ్, లా లా ల్యాండ్, ది ఫేవరెట్, పూర్ థింగ్స్‌ లాంటి చిత్రాల్లో నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన డేనియల్ డే-లూయిస్ 3 స్థానంలో నిలిచాడు. ది గ్లాడియేటర్ II నటుడు డెంజెల్ వాషింగ్టన్ 4వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నికోల్ కిడ్మాన్, డేనియల్ కలుయుయా, సాంగ్ కాంగ్ హో, కేట్ బ్లాంచెట్, కోలిన్ ఫారెల్,  ఫ్లోరెన్స్ పగ్ వరుసగా స్థానాల్లో నిలిచారు. ఇండియా నుంచి కేవలం ఇర్ఫాన్ ఖాన్‌కు మాత్రమే ప్లేస్ దక్కింది.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)