Breaking News

హీరోయిన్‌తో ఆ సీన్‌ కోసం 37 టేకులు.. హీరోకే చిరాకు వచ్చిందట!

Published on Tue, 01/28/2025 - 16:07

తెరమీద రొమాన్స్‌ పండిచడం అనేది అంత ఈజీ పని కాదు. హీరోహీరోయిన్లు మధ్య కో ఆర్డినేషన్ చాలా ముఖ్యం. అయితే ఇలాంటి సీన్స్‌ దాదాపు సింగిల్‌ టేక్‌లో క్లోజ్‌ చేస్తుంటారు. ఏదైనా తేడా ఉంటే ఒకటి, రెండు టేకులు తీసుకుంటారు. కానీ ఓ సినిమాలో ముద్దు సీన్‌ కోసం హీరోహీరోయిన్లు 37 టేకులు తీసుకున్నారు. దర్శకుడు అనుకున్న విధంగా సీన్‌ రాకపోడంతోనే లన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. 

(చదవండి: పేరుకే బుల్లితెర నటి.. కోట్ల సంపాదన.. ఆ యంగ్‌ బ్యూటీ ఎవరంటే?)

అయితే ఆ లిప్ సీన్ అన్ని టేకులు తీసుకోవడానికి కారణం హీరోయినే అని చెబుతున్నాడు హీరో. ఇంతకీ ఎవరా హీరో ఏంటా కథ కామీషు అంటే.. 2014 లో వచ్చిన కాంచి సినిమాలో కార్తీక్ ఆర్యన్( Kartik Aaryan), మిస్తి చక్రవర్తి జంటగా నటించారు. సుభాష్ గయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఒక లిప్ లాక్ కోసం ఏకంగా 37 టేకులు చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో హీరో కార్తీక్‌ ఆర్యనే చెప్పాడు. ‘ముద్దు సీన్‌ కూడా తలనొప్పిగా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. కాంచి సినిమాలో ఓ కిస్‌ సీన్‌ ఉంటుంది. లవర్స్‌గా నటించిన మిస్తి, నేను ముద్దు పెట్టుకోవాలి. షూటింగ్‌ ప్రారంభమైంది. ఇద్దరం కలిసి కిస్‌ చేసుకున్నాం. కానీ దర్శకుడు సంతృప్తి చెందలేదు. కట్ చెప్పేసి మళ్లీ ముద్దు పెట్టుకోమన్నాడు. అలా మొత్తంగా 37 టేకులు తీసుకున్న తర్వాత ‘ఓకే’ చెప్పాడు.

(చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ కమెడియన్ అలీ.. వీడియో వైరల్!)

అయితే అన్ని టేకులు తీసుకోవడంతో నా తప్పేమి లేదు. కానీ మిస్తి ఎక్కన నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని కాస్త భయపడ్డాను. దర్శకుడు చెప్పినట్లుగానే ముద్దు పెట్టుకున్నాం. అయినా ఆయన కట్‌ చెప్పేశాడు. ఒకనొక దశలో నాకే చిరాకు వేసింది. ‘నాకు ముద్దు పెట్టుకోవడం రావట్లేదు. ఎలా పెట్టుకోవాలో మీరు చేసి చూపించండి సార్‌’ అని డైరెక్టర్‌ని అడగాలనిపించింది(నవ్వుతూ) అని కార్తిక్‌ చెప్పారు. అయితే ఈ ముద్దు సీన్‌ గురించి మిస్తి ఎక్కడ మాట్లాడలేదు. కానీ హీరో కార్తినే తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాంచి చిత్రం విషయానికొస్తే.. 2014లో ఈ చిత్రం విడుదలైంది.  ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, రిషి కపూర్, ఆదిల్ హుస్సేన్, ముఖేష్ భట్ కీలక పాత్రలు పోషించారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)