Breaking News

అనుబంధాలకే ఆస్కారం

Published on Tue, 03/17/2026 - 04:15

ఎన్ని గ్రాఫిక్స్‌ వచ్చినా, ఎన్ని ఏఐ విప్లవాలు వచ్చినా, ‘ఈ జనరేషన్‌ కథ’ అనుకోవడానికి ఎన్ని ఫీట్లు చేసినా... గత, వర్తమాన, భవిష్యత్‌లలో తిరుగులేని కాలాతీత కథా వస్తువు... కుటుంబం, అనుబంధాలు, త్యాగాలు... మొదలైనవి. ‘నాది పాత స్కూలు’ అని చెబుతుంటారు  డైరెక్టర్‌ పాల్‌ థామస్‌ ఆండర్సన్‌. సెంటిమెంట్, భావోద్వేగాలు అనే ఆ పాత స్కూల్‌ సబ్జెక్ట్‌తోనే ఆస్కార్‌ బరిలో సంచలనం సృష్టించారు. అతడి ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ ఆరు ఆస్కార్‌ అవార్డులు గెల్చుకుంది. ఈ ఏడాది ‘ఉత్తమ చిత్రం’గా ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది...

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అనే ప్రసిద్ధ మాట ఉన్నప్పటికీ... ఆర్థికం ఒక్కటే కాదు అనేకానేక సంబంధాలు అనుబంధాలను నిర్ణయిస్తాయి అని చెప్పుకోవడానికి ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ను ఉదాహరణగా చెపొ్చచ్చు. ‘సాగర సంగమం’ సినిమాలో పితృ సమానుడైన బాలు (కమల్‌ హాసన్‌)ను శైలు అకారణంగా ద్వేషిస్తుంటే ‘అయ్యో!’ అనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్లు తెరుచుకొని ‘మాతృదేవోభవ పితృదేవోభవ’ అని పాడుతుంటే ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. అలాంటి బలమైన భావోద్వేగాలు ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’లో చాలా ఉన్నాయి.

ఇదీ కథ...
విప్లవ సంస్థ ‘ఫ్రెంచ్‌ 75’లో సభ్యులైన ΄్యాట్‌ కల్వాన్‌ (లియోనార్డో డికాప్రియో), పెర్పిడియో బెవర్లీ హిల్స్‌ (టెయన్‌ టేలర్‌) ప్రేమికులు. ఒక డిటెన్షన్‌ సెంటర్‌లో నిర్బంధించబడిన వలసదారులను బయటకు తీసుకువచ్చే క్రమంలో కమాండింగ్‌ ఆఫీసర్‌ స్టీవెన్‌ను అవమానిస్తుంది పెర్పిడియో. దీంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు స్టీవెన్‌. ఒక కేసులో పెర్పిడియోను అరెస్ట్‌ చేసిన స్టీవెన్, తన కోరిక తీర్చితే వదిలేస్తానని చెబుతాడు. అతడి డిమాండ్‌కు ఆమె అంగీకరించడంతో వదిలేస్తాడు.

పెర్పిడియా ‘చార్లీన్‌’ అనే బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తరువాత విప్లవ కార్యకలాపాలు కొనసాగించడానికి అజ్ఞాతంలోకి వెళుతుంది. బ్యాంకు దోపిడి సమయంలో సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసినందుకు పెర్పిడియో అరెస్ట్‌ అవుతుంది. స్టీవెన్‌ ఆమెను జైలు నుంచి తప్పించుకునేలా చేస్తాడు. అయితే ఇది ఆమె మీద ప్రేమతో చేసింది కాదు. ‘ఫ్రెంచ్‌ 75’ సభ్యుల సమాచారాన్ని తెలుసుకోవాలనే కుట్రతో చేస్తాడు.

పెర్పిడియో ఇచ్చిన సమాచారంతో ఆమె సహచరులను వెంటాడి, ఉరి తీస్తాడు. పదహారేళ్ల తరువాత.... చార్లీన్‌కు తానే తండ్రి అని తెలుసుకున్న స్టీవెన్‌ ఆమెను చంపేందుకు కుట్రలు చేస్తాడు. ఇన్నాళ్లు చార్లీన్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ΄్యాట్‌ ఎలా స్పందించాడనేది కథ. తనను వదిలేసి వెళ్లిపోయిన తల్లిపై చార్లీన్‌కు కోపం, పెంపుడు తండ్రి (΄్యాట్‌)పై అనుమానం. ΄్యాట్‌ ఆమె నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నాడనేది అసలు సిసలు కథ.

వైన్‌ల్యాండ్‌ స్ఫూర్తితో...
‘వైన్‌ల్యాండ్‌’ నవలను స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్‌ పాల్‌ థామస్‌ ‘వన్‌ బాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ తీశారు. థామస్‌ పిన్‌చాన్‌ 1990లో రాసిన పోస్ట్‌ మోడర్న్‌ నవల... వైన్‌ల్యాండ్‌. అమెరికా అధ్యక్షుడిగా రోనాల్డ్‌ రీగన్‌ తిరిగి ఎన్నికైన సంవత్సరం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1960 నుంచి 1980 వరకు అమెరికన్‌ సమాజంలో జరిగిన రకరకాల సంఘటనలను కళ్లకు కడుతుంది.

తీయలేనేమో... లేదు తీయాల్సిందే!
‘ఈ నవలను సినిమాగా తీయగలనా?’ అనే సందేహం మొదట్లో పాల్‌ థామస్‌కు వచ్చింది. నవలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఏదైనా కాన్సెప్ట్‌ అనుకొని తీయాలనుకున్నాడు. అప్పుడు అతడి మదిలోకి వచ్చిన ఆలోచనలు...యాక్షన్‌ కార్‌–చేజ్‌ మూవీ, మరొకటి... ఒక విప్లవకారిణి కథ. తండ్రి–కూతురు అనుబంధంతో పై రెండు కాన్సెప్ట్‌లను కలిపి సినిమా తీయాలనుకున్నారు.

కారు ఛేజింగ్‌లు, షూటౌట్‌లతో యాక్షన్‌–హెవీ కథనం ఉండాలి. అదే సమయంలో బలమైన భావోద్వేగాలు ఉండాలనుకున్నారు. డ్రాఫ్ట్‌ల మీద డ్రాఫ్ట్‌లు రాశారు. ఎన్నోసార్లు తిరగరాసుకున్నాకగానీ తనకు స్క్రిప్ట్‌ సంతృప్తిగా అనిపించలేదు. అలా సినిమా తెర మీదికి వచ్చింది. ఆండర్సన్‌ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రానికి అయిన బడ్జెట్‌ చా...లా ఎక్కువ!

ఒక తల్లి కథ
విప్లవకారిణి, ప్రేమికురాలు, అన్యాయానికి గురైన మహిళ, ఒక బిడ్డకు తల్లిగా... రకరకాల షేడ్స్‌తో తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు టెయన్‌ జాక్వెలిన్‌ టేలర్‌. సింగర్, సాంగ్‌ రైటర్, మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్‌ వీడియో డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.

డైనమిక్‌ డాటర్‌
‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’లో కూతురిగా ప్రధాన పాత్ర పోషించింది అమెరికన్‌ నటి చేజ్‌ ఇన్ఫినిటి పేన్‌. పదేళ్ల వయసులో స్కూలులో జరిగిన సంగీత కార్యక్రమానికి ఎంపిక కావడం ద్వారా ఆమె మ్యూజిక్‌ జర్నీ మొదలైంది. హైస్కూల్‌ రోజుల్లోనే మ్యూజిక్, థియేటర్‌ ప్రోగ్రామ్స్‌తో బిజీబిజీగా గడిపేది. ‘కె–పాప్‌ కవర్‌ డ్యాన్స్‌ గ్రూప్‌’ కో–ఫౌండర్‌లలో ఇన్ఫినిటీ ఒకరు. ఫ్రెంచ్‌ బాగా వచ్చు.

గతం విషయం ఎలా ఉన్నా... ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’తో ‘ఈ అమ్మాయి ఎవరు?’ అని ప్రపంచ ప్రేక్షకులు ఆరా తీసేలా నటించింది. ‘కెమెరా టెస్ట్‌ల తరువాత ఆండర్సన్‌ సినిమాకు ఎంపిక కావడం మాట ఎలా ఉన్నా, లియో డికాప్రియోతో కలిసి నటిస్తున్నాననే ఊహ భయపెట్టింది. అమ్మానాన్నలకు ఫోన్‌ చేసి చెబితే, నా కంటే ఎక్కువ భయభ్రాంతులకు గురయ్యారు! ఇదొక గొప్ప అవకాశం. భయపడకూడదు’ అనుకొని చేశాను’ అంటుంది ఇన్ఫినిటీ పేన్‌.

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)