Breaking News

ఒకప్పుడు తోపు యాక్టర్‌.. ఇప్పుడు ఆటో డ్రైవర్‌!

Published on Sat, 08/08/2026 - 11:22

సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే చాలు.. జీవితం మారిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ తమిళ నటుడు మారిముత్తు జీవితం చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని అర్థమవుతుంది. ఒకప్పుడు వెండితెరపై నటుడిగా మెరిసిన ఆయన.. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతున్నారు.  ఎం. శశికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం సుబ్రమణ్యపురం 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో అనంతపురం 1980 పేరుతో ఈ సినిమా విడుదలైంది. శశికుమార్‌, జై, స్వాతి తదితరులు నటించిన ఈ చిత్రంలో మారిముత్తు కూడా కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా విజయవంతమైనప్పటికీ ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మదురైలో జన్మించి..

మదురైలో జన్మించిన మారిముత్తు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మూడో తరగతి వరకే చదువుకున్నట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే వివిధ పనులు చేస్తూ జీవనం సాగించారు. రేడియో రిపేర్‌ షాప్‌లోనూ పనిచేశారు. అనంతరం సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు.అక్కడ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో చిత్రబృందం మారిముత్తు ఫొటో తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆడిషన్‌కు పిలవడంతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. అలా సుబ్రమణ్యపురంలో నటించే అవకాశం దక్కింది.

అయితే ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఆటో నడపడం మొదలుపెట్టారు. ఇలా ఆటో నడుపుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల్లో నటించిన వ్యక్తి.. జీవనం కోసం ఆటో నడపడం చూసి పలువురు ఆయన పట్టుదలను ప్రశంసిస్తున్నారు. మళ్లీ సుబ్రమణ్యపురం 2 వంటి సినిమాలో మంచి పాత్ర దక్కుతుందని మారిముత్తు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)