Breaking News

ధనుష్‌ కంటే గొప్ప నటులెవరున్నారు?: ఆదిపురుష్‌ డైరెక్టర్‌

Published on Sun, 08/31/2025 - 13:34

తమిళ స్టార్‌ ధనుష్‌ (Dhanush).. ఎలాంటి పాత్రలోనైనా జీవించేయగలడు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగలడు. అందుకే రెండుసార్లు (ఆడుకాలం, అసురన్‌ సినిమాలకుగానూ) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం బయోపిక్‌ చేస్తున్నాడు. ఆదిపురుష్‌ ఫేం ఓం రౌత్‌ దీనికి దర్శకత్వం వహించనున్నాడు.

కలాం బయోపిక్‌
ఈ సినిమాకు కలాం: ద మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా (Kalam: The Missile Man of India Movie) అనే టైటిల్‌ ఖరారు చేశారు. మే నెలలో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. తాజాగా ఓం రౌత్‌ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను కలాంను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను. ఆయన పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయన గురించి వెండితెరపై చెప్పినప్పుడు మరెంతో మంది ఇన్‌స్పైర్‌ అవుతారు.

ధనుష్‌ ఎందుకంటే?
ధనుష్‌ అద్భుతమైన యాక్టర్‌. ఆయనకంటే గొప్ప నటుడు మరొకరు లేరు. కలాం బయోపిక్‌లో నటించేందుకు ధనుష్‌ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఓం రౌత్‌ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించనున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థ అధినేత అభిషేక్‌ అగర్వాల్‌, టీ సిరీస్‌ సంస్థ అధినేత భూషణ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు.

సినిమా
ధనుష్‌ విషయానికి వస్తే ఇటీవలే శేఖర్‌ కమ్ముల 'కుబేర'తో భారీ హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం అతడి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఓం రౌత్‌ విషయానికి వస్తే.. బయోపిక్‌తోనే దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. బాలగంగాధర్‌ తిలక్‌ బయోపిక్‌ 'లోకమాన్య: ఏక్‌ యుగపురుష్‌' మూవీతో దర్శకుడిగా మారాడు. తానాజీ, ఆదిపురుష్‌ సినిమాలు తెరకెక్కించాడు.

చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)