‘ ఓ..! సుకుమారి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 07/17/2026 - 14:43

టైటిల్‌: ఓ..! సుకుమారి
నటీనటులు: తిరువీర్, ఐశ్వర్య రాజేష్,  మురళీధర్ గౌడ్, ఝాన్సీ  తదితరులు
నిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మెంట్స్ 
నిర్మాత : మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్‌ దర్శన్‌
సంగీతం: భరత్‌ మంచిరాజు
సినిమాటోగ్రఫీ: సీహెచ్‌ కుషేందర్‌
ఎడిటర్‌: శ్రీవరప్రసాద్‌
విడుదల తేది: జులై 17, 2026

వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో తిరువీర్‌. మంచి కథ అయితేనే సినిమా చేస్తారన్న పేరు ఆయన సంపాదించుకున్నాడు. అందుకే ఆయన నుంచి కొత్త సినిమా వస్తుదంటే కొంత ఆసక్తి, అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను ‘ఓ..! సుకుమారి’ అందుకుందా? తిరువీర్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

ఓ..! సుకుమారి కథేంటంటే..
తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన యాదగిరి(తిరువీర్‌) సర్పంచ్‌ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని చిన్నాన్న కొడుకు (గవిరెడ్డి) అతని ప్రత్యర్థికి సపోర్ట్‌గా ఉంటాడు. వీరిద్దరిలో ఎవరైతే పెళ్లి చేసుకొని మగబిడ్డను కంటారో వాళ్లకు 80 ఎకరాల ఆస్తి దక్కుతుందని తాత వీలునామా రాస్తాడు. దీంతో ఆస్థి కోసం యాదగిరి పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అవుతాడు.  ఓ అమ్మాయిని పెళ్లిచూపులు చూసేందుకు వెళ్లి, అదే ఊరికి చెందిన దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి ఇష్టపడతాడు. దామిని మాములు అమ్మాయి కాదు. ఆమెకు ఓ సమస్య ఉంటుంది. ఎవరిని ముట్టుకున్నా..షాక్‌ కొడుతుంది. ఊరి పెద్దలంతా ఈ విషయాన్ని దాచి.. యాదగిరితో పెళ్లి చేయిస్తారు. శోభనం రోజు యాదగిరికి ఈ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి వైవాహిక జీవితం ఎలా సాగింది? అసలు దామిని ముట్టుకుంటే షాక్‌ ఎందుకు వస్తుంది?  సర్పంచ్‌ కావాలన్న యాదగిరి కోరిక నెరవేరిందా లేదా? తాత 80 ఎకరాల ఆస్తి ఎవరికి దక్కింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
అమ్మాయిని ముట్టకుంటే షాక్‌ కొట్టడం.. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. అయితే దాన్ని తెరపై అంతే కొత్తగా ప్రజెంట్‌ చేయడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. ఒంట్లో కరెంట్‌ ఉండే అమ్మాయి..అది తెలియక పెళ్లి చేసుకున్న అమాయకపు అబ్బాయి.. కథగా చూస్తే ఇది చాలా ఆసక్తికరమైన పాయింటే. కానీ దర్శకుడు ఆ పాయింట్‌ చుట్టు బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో తడబడ్డాడు. హీరోయిన్‌కి ఉన్న సమస్యతో ప్రేక్షకుడు కనెక్ట్‌ అయ్యేలా కథను నడిపించలేకపోయాడు. 

ఆ సమస్యను అటు సీరియస్‌గా చర్చించలేక..ఇటు కామెడీగా చూపించలేక.. తటస్థంగా చూపించడంతో ప్రేక్షకుడు అంతగా కనెక్ట్‌ కాలేకపోతాడు. ఆ సమస్య ఎలా వచ్చిందో చెప్పారు కానీ..అది చివరిలో ఎలా రాలేదో సరిగా చెప్పలేదు. అయితే కొన్ని చోట్ల కామెడీ మాత్రం బాగానే వర్కౌట్‌ అయింది. సినిమా ప్రారంభం ఆసక్తికరంగానే ఉంటుంది. 

హీరోయిన్‌ సమస్యను చూపించి..ఆ తర్వాత హీరో పాత్రని పరిచయం చేశారు. వీరిద్దరి నేపథ్యాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఇద్దరు కలిసే వరకు వచ్చే కామెడీ సీన్లు కొంతమేర నవ్విస్తాయి. పెళ్లి చూపుల పేరుతో ఊర్లో చేసే హంగామా కొంత అతిగా ఉన్నా.. కామెడీ వర్కౌట్‌ అయింది.  ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్‌గా సాగుతుంది. విడిపోయిన భార్యభర్తలు మళ్లీ కలవడం చుట్టే సన్నివేశాలు రాసుకున్నారు.  అయితే ఆయా సీన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాలేవు. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. 

 ఎవరెలా చేశారంటే..
ముట్టుకుంటే కరెంట్‌ షాక్‌ తగిలే అమ్మాయి దామినిగా ఐశ్వర్య రాజేష్‌ చక్కగా నటించింది. యాక్షన్ సీన్స్‌ కూడా అదరగొట్టేసింది. ఇక తిరువీర్‌ గురించి తెలిసిందే. అమాయకపు పాత్రల్లో ఒదిగిపోతాడు. ఇందులో కూడా ఆయన అలాంటి పాత్రే చేశాడు. కొంచెం పిసినారి, అమాయకపు భర్త యాదగిరిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆమని, క్రాంతి బలివాడ, గవిరెడ్డి శ్రీనివాస్, జీవన్, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు ఓకే. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)