అటు బాలయ్య.. ఇటు పవన్‌.. తగ్గేదెవరు?

Published on Tue, 06/10/2025 - 11:39

టాలీవుడ్‌కి సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో పలు బడా సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. పండగ వేళ సెలవులు ఉండడం.. అంతా ఎంజాయ్‌ చేసే మూడ్‌లో  ఉంటారు కాబట్టి.. స్టార్‌ హీరోల సినిమాలు ఎక్కువ ఈ పండగ సమయాల్లోనే వస్తుంటాయి. అయితే ఒక్కోసారి రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవన్నీ హిట్‌ అయితే..మరికొన్ని సార్లు వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుంది. ఈ పోటీ కారణంగా కొన్ని మంచి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోతున్నాయి. 

అందుకే ఈ మధ్య బాక్సాఫీస్‌ వద్ద పెద్ద యుద్దాలేవి జరగట్లేదు. స్టార్‌ హీరోలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు. పోటీ ఉన్నా తమకు సినిమాకు ఢోకా లేదు అనుకుంటే తప్ప.. రిలీజ్‌ చేయట్లేదు. కానీ త్వరలోనే టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ యుద్దం జరగబోతుంది. ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ(Nandamuri Balakrishna)  అయితే మరో స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan). వీరిద్దరు బక్సాఫీస్‌ వార్‌కి రెడీ అవుతున్నారు.

మరోసారి బాక్సాఫీస్‌పై ‘తాండవం’?
బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ: తాండవం’(Akhanda 2). వీరిద్దరి కాంబినేషన్‌లో 2021లో వచ్చిన ‘అఖండ’సినిమాకు సీక్వెల్‌ ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. దాంతో పాటు రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. దసర కానుకగా సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం రాబోతుందని వెల్లడించారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్‌ కానుంది.

‘ఓజీ’ కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌
పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ(OG) ఒకటి. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియంకా మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇమ్రాన్‌ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు కానీ రిలీజ్‌ డేట్‌ మాత్రం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అదే రోజు బాలయ్య కూడా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకేసారి రావడం రెండూ సినిమాకు మంచిది కాదని సినీ పండితులు చెబుతున్నారు. కాస్త గ్యాప్‌ తీసుకొని వస్తే రెండు చిత్రాలకు మంచి కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉందని, ఒకోసారి వస్తే కొంచెం తేడా అయితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా ‘తగ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్‌ వార్‌కి సై అంటారా? కొద్ది రోజుల్లో తెలుస్తుంది. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)