Breaking News

OG X Review : ‘ఓజీ’ ట్విటర్‌ రివ్యూ

Published on Thu, 09/25/2025 - 04:50

పవన్‌ కల్యాణ్‌ నటించిన తాజా చిత్రం ఓజీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహో తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని సుజీత్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌ భారీ ఆంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో అయినా తమ హీరోకి విజయం దక్కాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాకు కావాల్సినంత హైప్‌ని తెచ్చిపెట్టింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 25) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓజీ కథేంటి? ఎలా ఉంది? పవన్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో సంబంధం లేదు. 

ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటే..బాగోలేదని మరికొంతమంది చెబుతన్నారు. రొటీన్‌ గ్యాంగ్‌స్టర్‌ స్టోరీ అని.. ఎలివేషన్స్‌ తప్ప ఇంకేమి లేదని కామెంట్స్‌ చేస్తున్నారు. కథ- కథనం వదిలేసి..దర్శకుడు దృష్టంతా ఎలివేషన్‌పైనే పెట్టాడని విమర్శిస్తున్నారు. 

ఓటీ టెక్నికల్‌గా బాగుంది. కొన్ని ఎలివేషన్స్‌ మినమా మిగతా కథంతా రొటీన్‌ అంటూ ఓ నెటిజన్‌ కేవలం 2.5 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు. 

 స్టోరీ బాగోలేదు. యాక్షన్‌, వీఎఫెక్స్‌ పర్వాలేదు. బీజీఎం బాగుంది అంటూ ఓవరాల్‌గా ఈ చిత్రానికి 2.25 రేటింగ్‌ ఇచ్చాడు మరో నెటిజన్‌.

 ఓజీ ఓ రాడ్‌ మూవీ. సుజీత్‌ అర్జెంట్‌గా తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతే మంచిది. తమన్‌ బయ్యా..ఎంత కావాలో అంతే బీజీఎం ఇస్తే సరిపోతుంది. తలకాయ నొప్పి వచ్చేసింది నీ నేపథ్య సంగీతానికి’ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

 సెకండాఫ్‌ ఇంకొంచెం బెటర్‌గా తీయొచ్చు. కథనం ఊహించేలా ఉంది. సినిమాలో 70 శాతం యాక్షనే ఉంది. తమన్‌ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్పవాడు. హీరోయిన్‌ ఎందుకు ఉందో.. అంటూ ఇంకో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)