Breaking News

అద్భుతమైన కంటెంట్‌తో 'ఓ అందాల రాక్షసి' స్టోరీ

Published on Sun, 12/28/2025 - 17:47

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా వస్తుంది. ఈ మూవీలో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.

కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు కథను, మాటల్ని రాశాను. థియేటర్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)