Breaking News

ఆ నిర్ణయంతో బాధపడ్డాను

Published on Sun, 04/13/2025 - 04:27

‘‘నేను హీరోయిన్‌గా నటించిన ‘డ్రీమ్‌ గర్ల్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ రూపొందింది. సీక్వెల్‌లోనూ నన్నే కథానాయికగా తీసుకుంటారని ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. అయితే, నన్ను కాదని అనన్యా పాండేను హీరోయిన్‌గా తీసుకున్నారు. వారి నిర్ణయంతో బాధపడ్డాను’’ అని బాలీవుడ్‌ బ్యూటీ నుష్రత్‌ బరుచా తెలిపారు. ఆయుష్మాన్‌ ఖురానా, నుష్రత్‌ బరుచా జోడీగా రాజ్‌ శాండిల్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’. 2019 సెప్టెంబరు 13న విడుదలైన ఈ మూవీ బాలీవుడ్‌లో హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ రూపొందింది.

సీక్వెల్‌లోనూ ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిగా రాజ్‌ శాండిల్యనే దర్శకత్వం వహించారు. అయితే హీరోయిన్‌గా అనన్యా పాండేను తీసుకున్నారు. 2023 ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నుష్రత్‌ బరుచా మాట్లాడుతూ– ‘‘డ్రీమ్‌ గర్ల్‌’లోని నటీనటులందరూ ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’లోనూ నటించారు. అయితే హీరోయిన్‌ పాత్రలో నాకు బదులు అనన్యా పాండేని తీసుకున్నారు.

యూనిట్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కానీ ఈ విషయంపై నేను యూనిట్‌లోని వారితో మాట్లాడలేదు. ఎందుకంటే అవతలి వారి నిర్ణయాలను మనం కంట్రోల్‌ చేయలేం కదా? తమ సినిమాలో ఎవర్ని తీసుకోవాలి? అనేది మేకర్స్‌పై ఆధారపడి ఉంటుంది. వాళ్ల ఇష్టాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. అందుకే బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాను’’ అని పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)