నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
Breaking News
కుమారస్వామి ఎక్కడివాడు? సోషల్ మీడియాలో వింత చర్చ!
Published on Tue, 06/30/2026 - 10:56
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎవరిని ట్రోల్ చేసుకుంటారో అస్సలు అర్థం కాదు. రీసెంట్‌గా 'ఇడుపు కాయితం' అనే పదం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నెటిజన్లు ఒకరిపై ఒకరు ఎలా విమర్శలు చేసుకున్నారో చూస్తూనే ఉన్నాం. ఎవడో ఓ ఆకతాయి పెట్టిన కామెంట్ కారణంగా ఒకరి భాష, యాసపై మరొకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఇందులోకి రాజకీయాలు కూడా ఎంటరయ్యాయి. సరే ఈ గోల ఎప్పుడు ఆగుతుంది అనుకుంటే కొత్తది మొదలైంది.
(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది)
నిన్నటివరకు ఆంధ్రా vs తెలంగాణ నెటిజన్ల మధ్య రచ్చ నడవగా.. ఇప్పుడు తెలుగు vs తమిళ నెటిజన్ల మధ్య ట్రోల్స్ హంగామా నడుస్తోంది. దీనంతటికీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కొత్త పోస్టరే కారణం. చాన్నాళ్లుగా కుమారస్వామి కథతో తీసే సినిమాలో తారక్ నటిస్తాడనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించారు. త్రిశూలం, డీఎన్ఏ, యుద్ధాలు తదితర అంశాలు ఈ పోస్టర్‌లో చూపించారు.
అయితే ఈ చిత్ర నిర్మాతలు నాగవంశీ, కల్యాణ్ రామ్.. పోస్టర్ షేర్ చేస్తూ 'ఉత్తరంలో జననం.. మధ్య భారతంలో తీర్చిదిద్దిన జీవితం.. దక్షిణాదిలో ఆరాధ్యుడిగా ఎదిగిన వ్యక్తిత్వం!' అని కుమారస్వామి గురించి పరోక్షంగా రాసుకొచ్చారు. దీంతో కుమారస్వామి తమ రాష్ట్రానికి చెందిన వాడని తమిళ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు కుమారస్వామి ఎక్కడివాడు? అనే వింత చర్చ మొదలైంది. మరి ఇదెప్పుడు ఆగుతుందో ఏంటో?
(ఇదీ చదవండి: సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)
Original name of Murugan is Ceyon ( சேயோன் ) , he was red in colour , he was the warrior god and he is the origin of all of us tamils , and his mother’s name is Kottravai - the original form of Tirupathi Venkateswara swamy .
Do not ready made up history and convince yourself… https://t.co/to9yfeMLSm— Prashanth Rangaswamy (@itisprashanth) June 29, 2026
Tags : 1