Breaking News

ఏడు వారాలు... పది కిలోలు

Published on Mon, 03/23/2026 - 03:32

క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఎలాంటి మేకోవర్‌కైనా ఎన్టీఆర్‌ సై అంటారు. అందుకు ఉదాహరణలుగా ‘అరవింద సమేత వీర రాఘవ, ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. తాజా చిత్రం ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) కోసం ఈ చాలెంజ్‌ను స్వీకరించారని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభ సమయంలో కాస్త హెవీ బాడీ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ ఇటీవలి కాలంలో చాలా సన్నగా కనిపించారు. హీరో క్యారెక్టరైజేషన్‌ కోసమే ఎన్టీఆర్‌ ఇలా స్లిమ్‌ లుక్‌లోకి మారిపోయారని సమాచారం. ఈ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ ఏడు వారాల్లో పది కిలోల బరువు తగ్గారట.

నిపుణుల సమక్షంలో ప్రతిరోజూ గంటన్నర పాటు వ్యాయామం, లో ప్రోటీన్‌ డైట్‌ను ఫాలో అవుతూ లీన్‌ లుక్‌లోకి మారిపోయారని టాక్‌. ఇలా సినిమా షూట్‌ ప్రారంభంలో కాస్త హెవీ బాడీ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత లీన్‌ లుక్‌లోకి మారారంటే... ‘డ్రాగన్‌’లో ఈ హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, టోవినో థామస్, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని టాక్‌. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

Videos

నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..

మళ్ళీ ట్రాక్ తప్పుతోన్న ప్రభాస్..

లంచం తీసుకుంటూ దొరికిన లాజిస్టిక్స్ మేనేజర్

మల్లారెడ్డి.. కబడ్డీ, కబడ్డీ

పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..

రంగస్థలం 2 కి రంగం సిద్ధం

ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!

విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ

మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..

న్యూయార్క్ సిటీలో ఘోర విమాన ప్రమాదం

Photos

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)