Breaking News

చలో శ్రీలంక

Published on Sun, 11/01/2026 - 05:31

లూగర్‌ చూపు శ్రీలంక వైపు పడిందని తెలిసింది. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డ్రాగన్‌’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్‌ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ, గురు సోమసుందరం, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

1967 నేపథ్యంలో ఓపీఎం అక్రమ రవాణా ప్రధానాంశంగా ఈ సినిమా కథ సాగుతుందని, ఇప్పటికే విడుదలైన ‘డ్రాగన్‌’ గ్లింప్స్‌ స్పష్టం చేస్తోంది. ఇందులో లూగర్‌ పాత్రలో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. ఈ పాత్రలో విభిన్న కోణాలు ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఎన్టీఆర్, రుక్మిణీ వసంత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. కాగా, ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ని శ్రీలంకలో  ప్లాన్‌ చేశారట. ఈ శ్రీలంక షెడ్యూల్‌ను మేకర్స్‌ ఆగస్టులోనే  ప్లాన్‌ చేశారు.

కానీ ఆ సమయంలో ఎన్టీఆర్‌ భుజానికి గాయం కావడం వల్ల కుదరలేదు. ఇప్పుడు వీలు పడటంతో ఈ షెడ్యూల్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌. ఒకవేళ శ్రీలంక కుదరకపోతే ముందుగా గుజరాత్‌లో కొంత చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత శ్రీలంకకు షిఫ్ట్‌ అవ్వాలని కూడా చూస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 11న విడుదల కానుంది.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)