Breaking News

నయనతార డాక్యుమెంటరీ.. ఎవరికీ ఉపయోగం లేదన్న ప్రముఖ రచయిత!

Published on Wed, 11/27/2024 - 15:16

దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌ నయనతార పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్‌ డాక్యుమెంటరీ విడుదల తర్వాత వివాదం మొదలైన సంగతి తెలిసిందే. తన సినిమాలో మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వాడారని హీరో ధనుశ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

ఇదిలా ఉండగా నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్‌ డాక్యుమెంటరీపై ప్రముఖ బాలీవుడ్ నవలా రచయిత్రి శోభా దే మండిపడ్డారు. తాను నయనతార డాక్యుమెంటరీని చూశానని.. కానీ అందులో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఏమీ లేవన్నారు. ప్రోమోలు చూసే వరకు నయనతార గురించి నాకు పూర్తిగా తెలియదని.. అందుకే ధైర్యం చేసి 45 నిమిషాల డాక్యుమెంటరీ చూసినట్లు తెలిపారు.

(ఇది చదవండి: నయన్- ధనుశ్‌ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్‌ కుమార్‌)

అయితే వివాహం లాంటి వ్యక్తిగత విషయాలను డబ్బుల కోసం ఇలా డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ఆమె విమర్శించారు. ఇందులో ఎలాంటి సందేశం లేదని అన్నారు. ఆమెను చూసి మరికొందరు సినీ తారలు డబ్బుల కోసం ఇదే పద్ధతిని పాటిస్తారేమో అంటూ విమర్శలు చేశారు. అయితే కొంతమంది శోభా దే వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

కాగా.. నయనతార రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేవలం తన వ్యక్తిగత, కెరీర్, వివాహం ఆధారంగా తీసుకొచ్చారు. విఘ్నేష్ శివన్‌తో ఆమె వివాహం గురించి ప్రధానంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఫుటేజీని ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)