Breaking News

అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్‌లో ఎవరెవరంటే?

Published on Mon, 05/29/2023 - 19:49

బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్‌ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్‌ డ్రెస్సులతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంటారు.

తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్‌తో దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. 

అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అత్యంత చెత్త ఫ్యాషన్‌తో దారుణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు  దుస్తులు ధరించి ట్రోల్స్‌కు గురైంది.

ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్‌ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్‌షీట్, కర్టెన్ క్లాత్‌ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)