Breaking News

వాళ్లు చెప్పిందే నమ్మా.. ఇలా చేస్తారనుకోలేదు

Published on Thu, 03/19/2026 - 08:54

గత కొన్నిరోజులుగా 'సర్కే చునారియా' అనే పాట ఎంతలా వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బూతు సాహిత్యం మరీ దారుణంగా ఉండేసరికి కేంద్రం కూడా దీనిపై రియాక్ట్ అయింది. దీంతో పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. సింగర్ మంగ్లీ కూడా క్షమాపణలు చెప్పింది. ఈ గీతంలో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఇప్పుడీ వివాదంపై మాట్లాడింది. తన అనుమతి లేకుండానే ఇదంతా చేశారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?)

'ఈ పాటని మూడేళ్ల క్రితం కన్నడలో షూటింగ్ చేశారు. తర్వాత ఎలా మార్చారో నాకు తెలియదు. ఓ పెద్ద మూవీ కావడం, సంజయ్ దత్ లాంటి స్టార్ ఉండేసరికి ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాను. నిజానికి ఇది 'నాయక్ నహీ ఖల్నాయక్ హో మెయిన్' పాట రీమేక్ అనుకున్నాను. కన్నడ లిరిక్స్ అర్థం కాకపోవడం వల్ల వాళ్లు చెప్పిందే నమ్మాను. అందులో ఏం అసభ్యత అనిపించలేదు. కానీ హిందీలో డబ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అసలు ఇది నా దృష్టికే రాలేదు'

'పాట లాంచ్ ఈవెంట్‌లోనూ నాకు ఇబ్బందికర అనుభవాలు ఎదురయ్యాయి. లిరికల్ వీడియోలో ఏ మాత్రం బాగోలేని ఫొటోలు, నాతో పాటు సంజయ్ దత్‌కి సంబంధించిన ఏఐ ఫొటోని ఉపయోగించేసరికి చాలా చిరాకేసింది. అయినా నిగ్రహంగా ఉన్నాను. హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఇది కచ్చితంగా విమర్శల పాలవుతుందని ఊహించాను. ఈ విషయం దర్శకుడికి చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాను. ప్రజల విమర్శల కారణంగానే మేకర్స్ పాట తొలగించారు. ఇందుకు కృతజ్ఞతలు. ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉంటాను' అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.

కన్నడ హీరో ధ్రువ్ సర్జా హీరోగా నటించిన 'కేడీ' మూవీలోనిది ఈ పాట. దాదాపు మూడేళ్లకు పైగా సెట్స్‌లో ఉన్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకుడు. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించారు. రీసెంట్‌గా మొదటి పాటగా దీన్ని రిలీజ్ చేస్తే ఇంతలా వివాదాస్పదమైంది.

(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)

Videos

మంగ్లీ సాంగ్ పై కేంద్రం సీరియస్

జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ దూకుడు... గల్ఫ్ దేశాలపై భీకర దాడులు ఇక ప్రపంచ యుద్ధమే

ఆ రోజు వివేక చనిపోయినప్పుడు టీడీపీలో ఉన్న కానీ... మీకు ఎవ్వరికి తెలియని విషయం..

పిన్నెల్లికు ఘన స్వాగతం

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!

అసలు వంట వచ్చా..? సమంతకు కోపం తెప్పించిన సుమ

రీల్స్ పిచ్చితో యువత పిచ్చి పనులు

గంటపాటు వర్సానికి మునిగిపోయిన అమరావతి రోడ్లు

హర్మాజ్ జలసంధి ఆక్రమణ కోసం ట్రంప్ భారీ వ్యహం

Photos

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)